బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరయ్యారు. విచారణ సందర్భంగా న్యాయవాదులను సైతం లోనికి అనుమతించలేదు. ఇదిలా ఉంటే కేటీఆర్ విచారణ సందర్భంగా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు, విద్యార్థి విభాగం నాయకులను అర్ధరాత్రి నుంచే అదుపులోకి తీసుకోగా.. జూబ్లీహిల్స్ పీఎస్కు భారీగా చేరుకున్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేశారు.
మరోవైపు తెలంగాణ భవన్ వద్ద కూడా పోలీసులు ఓవరాక్షన్ చేశారు. కార్యకర్తలు బయటకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. కార్యకర్తలు బయటకు వెళ్లకుండా తెలంగాణ భవన్ గేట్లు మూసివేసేందుకు యత్నించారు. దీన్ని అడ్డుకోవడంతో పోలీసులు, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో పలువురు కార్యకర్తలు గాయపడ్డారు.
SIT ఎదుట విచారణకు హాజరయ్యేందుకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు చేరుకున్న కేటీఆర్ https://t.co/qpPlzVyNEY pic.twitter.com/vRGkJ6lSM2
— Telugu Scribe (@TeluguScribe) January 23, 2026