హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) ఆదేశాలతో రాష్ట్రంలోని పోలీసులు తప్పుల మీద తప్పులు చేస్తున్నారని, హోంమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ( RS Praveen Kumar ) పోలీసు డిపార్ట్మెంట్ బలి అవుతోందని బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్( RS Praveen Kumar )ఆరోపించారు. తెలంగాణ భవన్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ నాయకులను ఇరికించే కుట్రలు చేస్తున్నారని వెల్లడించారు. ఈ కేసులో 350 మంది సాక్షులను విచారించి ఇప్పటి వరకు ఛార్జ్ షీట్ దాఖలు చేయలేదని విమర్శించారు. ఛార్జ్ షీట్లో బీఆర్ఎస్ నాయకుల పేర్లు పెట్టాలని అధికారులపై సీఎం ఒత్తిడి తెస్తున్నారని పేర్కొన్నారు.ఒక సీనియర్ జర్నలిస్టును ఇరికించి, అతను సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ వేస్తే బీఆర్ఎస్ నాయకుల పేర్లు చెప్తారా లేదా అని బెదిరిస్తున్నారని ఆరోపించారు.