ఆదివాసీలు అంటే.. సంస్కృతి, సంప్రదాయాలు, పచ్చని గూడేలు, అడవులు గుర్తొస్తాయి. ప్రపంచం అన్ని రంగాలలో దూసుకుపోతుంటే.. ఆదివాసులు మాత్రం అదే అడవుల్లోనే జీవనం సాగిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధికి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నామని చెబుతున్నా ఫలితం లేదు. గ్రామాలకు రోడ్డు సౌకర్యం, వాగులపై వంతెనలు లేవు. రేషన్ బియ్యానికి వాగులు, వంకలు దాటాల్సిందే. ఆసుపత్రులు ఉన్నా మార్గమధ్యలో 108 వాహనాలలో ప్రసవాలు జరుగు తూనే ఉన్నాయి. ఏజెన్సీలో చాలా గిరిజనులకు అటవీ హక్కు పట్టా కోసం వేచి చూడా ల్సిన పరిస్థితులే ఉన్నాయి. ఇప్పటికీ ఏజెన్సీ ఏరియాల్లో కనీసం తాగు, సాగు నీటి వసతుల కోసం ప్రాజెక్ట్‌ల నిర్మాణాలు లేకపోవడంతో వర్షాధారిత పంటలపైనే ఆధారపడాల్సి వస్తున్న ది. ప
ది, ఇంటర్, డిగ్రీ చదువుకున్న యువకులు పైచదువుల కోసం పట్టణాలకు వెళ్లలేక మధ్యలోనే చదువులకు స్వస్తి చెప్పాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. కొలాం గిరిజనులకు మంజూరైన ఇండ్లను నిర్మించుకునేందుకు సిద్ధమైనప్పటికీ అటవీ శాఖ అధికారులు అడ్డు తగలడంతో 40 గ్రామాలలో ఇండ్లు పునాదులకే పరిమితమయ్యాయి. దీంతో సొంతింటి కల నెరవేరడం లేదు. ఇప్పటికే కొలాం గిరిజనులు ఐటీడీఏ ముందు చాలా సార్లు తమ ఇండ్లు ఆపొద్దని ధర్నాలు, రిలే దీక్షలు నిర్వహించారు. అయినా పనులు ముందుకు సాగడం లేదు. నేడు ‘ప్రపంచ ఆదివాసీ దినోత్సవం’ సందర్భంగా కథనం..
– ఉట్నూర్, ఆగస్టు 8

మెరుగుపడని విద్యా వ్యవస్థ
ఉట్నూర్ ఐటీడీఏ పరిధిలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గల ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 133 ఆశ్రమ పా ఠశాలలో 31,000లకు పైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. అయినా వాగులు, వంకల కారణంగా చిన్నారులు సక్రమంగా చదువుకోవడం లేదు. విద్యాహక్కు చట్ట ప్రకారం ఏజెన్సీలో విద్యావకాశాలు అందడం లేదు. ఏజెన్సీలో డిగ్రీ తర్వాత ఉన్నత విద్యకు గిరిజన యువతకు అవకాశాలు లేకపోవడంతో అర్ధాంతరంగా చదువు మానుకోవాల్సిన దుస్థితి ఎదువుతున్నాయి. కనీసం ఒక యూనివర్సిటీ, మెడికల్ల, నర్సింగ్ కళాశాలలు లేకపోవడం బాధాకరం. ఇలా అయితే గిరిజనులు ఉన్నత విద్యావంతులు ఎప్పుడు అవుతారు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
వైద్యం అంతంతే..
ఏజెన్సీలో వైద్య సేవలు దారుణంగా ఉన్నాయని చెప్పొచ్చు. గిరిజన గ్రామాలకు సరైన రోడ్డు మార్గా లు లేకపోవడంతో వైద్యం అందడం లేదు. మారుమూల గ్రామాలకు కనీసం 108 వాహనాలు కూ డా పోలేని పరిస్థితులు ఉన్నాయి. వర్షాకాలం నిం డు గర్భిణులు వాగులు దాటుతూ ప్రసవాలు జరిగిన, మరణాలు జరిగిన ఘటనలు కోకొల్లలుగా ఉ న్నాయి. ఉట్నూర్ ఐటీడీఏ పరిధిలోని ఉమ్మడి జి ల్లాలో 32 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 186 ఉప ఆరోగ్య కేంద్రాలు వీటితోపాటు సమస్యాత్మక ప్రాం తాలలో 11 అవ్వల్ అంబులెన్స్‌లు ఉన్నా.. మాత శిశు మరణాలు జరుగుతూనే ఉన్నాయి. ఐటీడీఏ కేంద్రమైన ఉట్నూర్ జిల్లా ఆసుపత్రికి కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కెరమెరి, జైనూర్, సిర్పూర్(యు) వంటి మారుమూల గిరిజన గ్రామాల రోగులు వస్తారంటే అర్థం చేసుకోవచ్చు. వైద్యం పరిస్థితులు ఎలా ఉన్నాయనే విషయం అర్థమవుతున్నది. ఉట్నూర్ జిల్లా ఆసుపత్రిలో సరైన వైద్యలు లేక పోవడంతో అరకొర వైద్యులతో వైద్యం అందిస్తున్నారు. ఇక్కడి నుండి జిల్లా కేంద్రానికి రెపర్స్ ఎక్కువగా ఉంటున్నాయని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉట్నూర్ కేంద్రంగా ఉన్న తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్లో సరైన సిబ్బంది లేక రక్త పరీక్షలు సక్రమంగా కావడం లేదు.

అందని అటవీ హక్కు పత్రాలు
ఏజెన్సీలో ఆదివాసులు అటవీ ఉత్పత్తులు, అటవీ భూములపైనే ఆధారపడి జీవిస్తుంటారు. కేసీఆర్ హయాంలో అటవీ భూములపై ఆధారపడి జీవిస్తున్న ఆదివాసులకు అటవీ హక్కు చట్టం 2006 ప్రకారం 2.70 లక్షల ఎకరాలకు హక్కు పత్రాలు అందించారు. తర్వాత హక్కు పత్రాలు ఇవ్వక పోవడంతో గిరిజన రైతులకు రైతుబంధు, రైతు బీమాలు అమలు కావడం లేదు. వర్షాధారిత పంటలపై ఆధారపడి జీవిస్తుండడంతో సరైన పంటలు పండక రైతులు అప్పులపాలవుతున్నారు. కనీసం ఉద్యాన పంటలను ప్రోత్సహించకపోవడంతో రైతుల అభివృద్ధి జరగడం లేదు.
అసంతృప్తిలో నిరుద్యోగులు
ఏజెన్సీలో ఇప్పుడిప్పుడే విద్యావంతులుగా మారుతున్న యువతకు ప్రభుత్వాలు సరైన ఉపాధి, ఉ ద్యోగావకాశాలు చూపించకపోవడంతో నిరుద్యోగు లు అసంతృప్తిగానే ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నా.. ఏజె న్సీ ప్రత్యేక డీఎస్సీ నిర్వహించకపోవడంతో నిరుద్యోగులు ఉద్యోగావకాశాలు పొందలేకపోతున్నారు. అలాగే ఐటీడీఏలో చాలా ఖాళీ పోస్టులు ఇన్చార్జిలతో నడుస్తున్నా.. నోటిఫికేషన్లు వేయడం లేదని నిరుద్యోగులు వాపోతున్నారు. ఎంఎస్ఎంఈ పథ కం ద్వారా ఉట్నూర్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో ఫుడ్ ట్రాక్, పిజ్జా, రె స్టారెంట్, బ్రిక్స్ మేకింగ్, పల్లి పట్టీ తయారీ, కాం క్రీట్ మిక్సింగ్ యూనిట్, నాప్కిన్ వంటి యూని ట్లు సరైన నిర్వహణ లేక నడపలేకపోతున్నారు.
