ఉప్పల్, మే 30 : మత విద్వేషాలు, హింసను రెచ్చగొట్టేలా ప్రసంగించారని ఆరోపిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై కాంగ్రెస్ మేడ్చల్ జిల్లా మైనార్టీ సెల్ చైర్మన్ ఆశుతో సహా పలువురు నేతలు సోమవారం నాచారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
కరీంనగర్లో హిందూ ఏక్తా ర్యాలీ సందర్భంగా నిర్వహించిన సభలో బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు. ముస్లింలకు వ్యతిరేకంగా అసభ్యకరమైన, అవమానకరమైన పదజాలాన్ని ఉపయోగించారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు.