సూర్యాపేట, అక్టోబర్ 27 (నమస్తేతెలంగాణ): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇంటిపై పోలీసులు దాడి చేయడాన్ని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఆదివారం కేటీఆర్ ఇంట్లో పోలీసుల సోదాలు చేయడాన్ని తప్పుబట్టారు. కారణం, వారెంట్ లేకుండా పోలీసులు తనిఖీల పేరుతో దాడులకు పాల్పడటం ప్రభుత్వ చేతగాని తనానికి నిదర్శనమని మండిపడ్డారు. కేటీఆర్ బావమరిది గృహప్రవేశం సందర్భంగా జరుగుతున్న దావత్ విషయంలో లేనిపోని ప్రచారం చేసి పోలీసులు దాడి చేయడం హేయమైన చర్యగా ఆయన పేర్కొన్నా రు. ఎక్కడో ఏదో జరిగితే కేటీఆర్‌కు ఏం సంబంధమని ప్రశ్నించారు. ఆదివారం సూర్యాపేటలో మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్ పట్ల పోలీసులు దుర్మార్గం గా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.