హైదరాబాద్ : ప్రజా పాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామిక విధానాలతో ఉద్యమాలపై ఉక్కుపాదం(Police brutality) మోపుతున్నది. ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు పెడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కాలరాస్తున్నది. బీఆర్ఎస్ నాయకులపై దాడే ఇందకు ప్రత్యక్ష్య సాక్ష్యం. వివరాల్లోకి వెళ్తే..భువనగిరిలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు మీద దాడికి నిరసనగా వినాయక చౌరస్తా వద్ద ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన తెలిపారు.
ఈ క్రమంలో వల్లపు విజయ్ ముదిరాజ్ అనే బీఆర్ఎస్ కార్యకర్తను(BRS activists) పోలీసులు వాహనంలో బస్టాండ్ వరకు ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. దీంతో ఆయన వెన్నుపూసకు గాయాలైనట్లు వైద్యులు తెలిపారు. ఓ వైపు నిందితులకు రాచ మర్యాదలు చేస్తూ మరోవైపు శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిని కారులో రోడ్డు మీద ఈడ్చుకుంటూ తీసుకెళ్తున్న వైనంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం తన పనితీరును మార్చుకోవాలని బుద్ధి జీవులు హితవు పలుకుతున్నారు.
ఇవి కూడా చదవండి..
KTR | తెలంగాణ మేలు కోరుకున్న వ్యక్తి మందా జగన్నాథం : కేటీఆర్
HMPV Case | మరో చిన్నారికి HMPV పాజిటివ్.. భారత్లో 18కి చేరిన కేసులు