Asha Workers | హైదరాబాద్ : హైదరాబాద్ కోఠి డీఎంఈ కార్యాలయం వద్ద పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆందోళన చేస్తున్న ఆశా వర్కర్లపై పోలీసులు చేయి చేసుకున్నారు. ఎగిరెగిరి ఓ ఆశా వర్కర్‌ను మహిళా పోలీసులు కొట్టారు. బాధిత ఆశా వర్కర్ ఆ దెబ్బలకు తాళలేక తల్లడిల్లిపోయింది. ఆమెను పోలీసులు అసభ్యకర పదజాలంతో దూషించారు.
సీఎం రేవంత్ రెడ్డి ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీ ప్రకారం రూ.18000 ఫిక్స్డ్ జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కోఠి డీఎంఈ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అరెస్టు చేసేందుకు యత్నించారు. దీంతో ఆశా వర్కర్లకు పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసు జులుం నశించాలంటూ పెద్ద ఎత్తున ఆశావర్కర్లు నినాదాలు చేశారు. ఇక ఆశావర్కర్లకు మద్దతు నిలిచిన బీఆర్ఎస్ కార్యకర్తలను కూడా పోలీసులు అరెస్టు చేశారు.
ఆశా వర్కర్ల మీద చేయి చేసుకున్న పోలీసులు
సీఎం రేవంత్ రెడ్డి ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీ ప్రకారం రూ.18000 ఫిక్స్డ్ జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కోటి డిఎంవి కార్యాలయం ముందు ఆందోళన చేస్తున్న ఆశా వర్కర్లు
ఆశా వర్కర్లకు పోలీసుల మధ్య వాగ్వాదం
ఏసీపీ శంకర్‌ను చుట్టుముట్టిన ఆశా… pic.twitter.com/BPsekWVcj2
— Telugu Scribe (@TeluguScribe) December 9, 2024
మహిళా ఆశా వర్కర్ల పట్ల ఏసిపి శంకర్ అసభ్య ప్రవర్తన https://t.co/kI01MgSQSD pic.twitter.com/Dz1FTvpHeQ
— Telugu Scribe (@TeluguScribe) December 9, 2024