Police | అకారణంగా సామాన్యుడిపై పోలీసుల దాడి.. సీఐకి ఫిర్యాదు చేసిన బాధితుడు
Police | రోడ్డు పక్కన నిలబడి ఉన్న ఓ సామాన్యుడిపై రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పోలీసులు జులుం ప్రదర్శించారు. బూతులు తిడుతూ దాడికి పాల్పడ్డా రు.
Police | షాద్నగర్, ఫిబ్రవరి 17: రోడ్డు పక్కన నిలబడి ఉన్న ఓ సామాన్యుడిపై రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పోలీసులు జులుం ప్రదర్శించారు. బూతులు తిడుతూ దాడికి పాల్పడ్డా రు.
బాధితుడి కథనం ప్రకారం.. కేశంపేట మండలం ఇప్పలపల్లికి చెందిన కుమ్మరి వెంకటేశ్ బోరు మోటర్లను రిపేర్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం రాత్రి పని ము గించుకొని పట్టణంలోని పరిగి రోడ్డులోని ఓ వైన్ షాప్ముందు నిలబడ్డాడు. ఆ వైన్స్లో నుంచి ఓ వ్యక్తి అక్కడే ఉన్న పోలీస్ పెట్రోలిం గ్ వాహనం వద్దకు వచ్చి ఏదో కవర్ ఇచ్చా డు. ఈ విషయాన్ని అక్కడే ఉన్న వెంకటేశ్ గమనించినట్టు భావించిన ఇద్దరు కానిస్టేబు ళ్లు అతడిపై నోరు పారేసుకున్నారు. బూతులు తిడుతూ, బెదిరింపులకు దిగారు. ఇక్కడ ఏం పని? అంటూ కొట్టారు. అనంతరం నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి శరీరంపై గాయాలయ్యేలా చితకబాదారు. అనంతరం అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. పోలీసుల దాడిలో వెంకటేశ్ కంటికి తీవ్ర గాయమైంది. కాళ్లపై, పిరుదులపై తీవ్రంగా కొట్టారని బాధితుడు వాపోయాడు. అకారణంగా పోలీసులు దాడిచేశారని ఈ విషయమై మంగళవారం షాద్నగర్ సీఐకి ఫిర్యాదు చేసినట్టు తెలిపాడు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

