Medaram : మేడారం జాతరలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(MLA KoushikReddy) కి అవమానం జరిగింది. కుటుంబంతో కలిసి సమ్మక్క, సారలమ్మలను దర్శించుకొని.. చెల్లించుకోవాలనుకున్న ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. దాంతో కౌశిక్ రెడ్డి తనను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. అయినా సరే పోలీసులు ఆయన మాట వినలేదు. పోలీసుల వైఖరిని ఖండించిన ఆయన వాగ్వాదానికి దిగారు. అంతలోనే పోలీసులు చుట్టూచేరి ఎమ్మెల్యేను బలవంతంగా అక్కడి నుంచి ఈడ్చుకెళ్లారు.
సమ్మక్క సారక్క జాతర చూసేందుకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి శుక్రవారం భార్య, కూతురుతో కలిసి మేడారం వచ్చారు. జాతరను చూసి అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవాలనుకున్న కౌశిక్ రెడ్డిని గద్దెల దగ్గరి నుంచి పోలీసులు ఈడ్చుకెళ్లారు. అనంతరం ఆయనను కారులో ఎక్కించి కరీంనగర్ తరలించారు. అయితే.. జాతరకు కుటుంబంతో కలిసి వచ్చిన నిర్భందించడాన్ని ప్రశ్నించిన కౌశిక్ రెడ్డి.. పోలీసుల వైఖరిని నిరసిస్తూ వీణవంక మండల కేంద్రంలో రోడ్డుపై బైఠాయించారు. ఆయన భార్య, కూతురు, కార్యకర్తలు కూడా నిరసన తెలపడంతో ఉద్రిక్తత ఏర్పడింది.