ములుగు జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ నాయకుల దౌర్జన్యానికి ఆత్మహత్య చేసుకున్న చుక్క రమేశ్ మృతి పట్ల శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు.
ప్రశ్నించే గొంతుకలపై దాడులకు నిరసనగా, పాత్రికేయులపై భౌతిక దాడులకు వ్యతిరేకంగా శాంతియుత వాతావరణంలో నిరసన తెలిపేందుకు బయలుదేరిన ములుగు నియోజకవర్గ ఇంచార్జ్ బడే నాగజ్యోతి, వై.సతీశ్ రెడ్డి, ములుగు జిల్లా బీఆర్ఎస్ నాయకులను సోమవారం నాడు అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీనిపై బడే నాగజ్యోతి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలను, నాయకులను బెదిరిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ములుగులో మంత్రి సీతక్క, వారి అనుచరులు చేస్తున్న ఆగడాలు శ్రుతి మించుతున్నాయని ఆరోపించారు. మంత్రి సీతక్క దిగజారుడు రాజకీయాలు మానుకోవాలి అంటూ హితువు పలికారు.
ఇది ప్రజా పాలనా? పోలీసు పాలనా?
ములుగులో కాంగ్రెస్ నాయకుల దౌర్జన్యంతో ఆత్మహత్య చేసుకున్న చుక్క రమేశ్ మృతికి నిరసనగా బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న శాంతియుత నిరసనను అడ్డుకున్న పోలీసులు.
ప్రశ్నించే గొంతుకలపై దాడులకు నిరసనగా, పాత్రికేయులపై భౌతిక దాడులకు వ్యతిరేకంగా శాంతియుత వాతావరణంలో… pic.twitter.com/feSJ2q8V1c
— BRS Party (@BRSparty) July 7, 2025
అసలేం జరిగిందంటే..
ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం చల్వాయికి చెందిన 29 ఏళ్ల చుక్క రమేశ్‌కు తల్లిదండ్రులు లేరు. ఇటీవల ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అయితే అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో అతని పేరు రాలేదు. దీంతో తనకు ఇంటి కేటాయింపులో అన్యాయం జరిగిందని సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించాడు. దీంతో ఆ మండలానికి చెందిన కాంగ్రెస్ నాయకులు రెచ్చిపోయి చుక్క రమేశ్‌పై బెదిరింపులకు దిగడమే కాకుండా పోలీసులకు మౌఖిక ఫిర్యాదు చేయటంతో పోలీసులు ముందూవెనుకా ఆలోచించకుండా సదరు యువకుడిని భయోత్పాతానికి గురిచేశారు. ఈ క్రమంలో చుక్క రమేశ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చుక్క రమేశ్ మృతికి నిరసనగా బీఆర్ఎస్ పార్టీ శాంతియుత నిరసనకు పిలుపునిచ్చింది. సోమవారం ములుగు జిల్లాకేంద్రంలో శాంతియుత నిరసన కార్యక్రమాన్ని చేపట్టి, చల్వాయిలో మృతు ని కుటుంబాన్ని పరామర్శించాలని నిర్ణయించింది. బీఆర్ఎస్ కార్యచరణ ప్రకటించిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ములుగు జిల్లాలో ఈ నెల 31 వరకు పోలీసు నిషేధాజ్ఞలు విధించింది. పోలీస్ యాక్ట్నూ ప్రయోగించింది. అయితే ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలు అమలు చేసినా తాము ముందుగా ప్రకటించిన కార్యక్రమాన్ని కొనసాగిస్తామని బీఆర్ఎస్ తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే.