వారంతా గ్రూప్-1 అభ్యర్థులు. మెయిన్స్‌లో నెగ్గితే ఇదే ప్రభుత్వంలో ఉన్నతాధికారులుగా నియమితులయ్యేవారు. ఇదంతా తమ ఘనతేనని చెప్పుకునే సీఎం చేతుల మీదుగా ఎల్బీ స్టేడియంలోనో, మరోచోటో నియామక పత్రాలు అందుకునేవారు. కానీ, అలాంటి పరీక్షార్థులపై లాఠీలు విరుచుకుపడ్డాయి. వీపులపై వాతలు తేలాయి. జీవో 29ని సమీక్షించాలని, పరీక్ష రీషెడ్యూల్ చేయాలని కోరడమే నేరమైంది. అశోక్‌నగర్‌లో నిరసన తెలిపిన అభ్యర్థులపై కాంగ్రెస్ సర్కార్ లాఠీచార్జి చేసింది.
Lathi Charge | హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): గ్రూప్-1 అభ్యర్థులపై పోలీసుల దమనకాండ కొనసాగుతూనే ఉన్నది. న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతున్న వారిపై శుక్రవారం కూడా లాఠీలు ఝుళిపించారు. ఉదయం నుంచే హైదరాబాద్ అశోక్‌నగర్ చౌరస్తా నుంచి ఆర్టీసీ క్రాస్‌రోడ్ వరకూ, ఇటు చిక్కడపల్లి సిటీ లైబ్రరీ వరకూ ఎక్కడ ఇద్దరు, ముగ్గురు గుమిగూడి కనిపించినా పోలీసులు వదల్లేదు. పెద్ద పొడవాటి వెదురుకర్ర లు, పోలీస్ లాఠీలతో గ్రూప్-1 అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేశారు. ఒకానొక దశ లో పోలీసులు లాఠీలతో విరుచుకుపడ్డారు. ‘వియ్ వాంట్ జస్టిస్’ అంటూ నినదించే గొంతులను పోలీసులు అత్యంత కర్కశంగా నొక్కేశారు. అభ్యర్థులు ఆడవారా? మగవా రా? అనేది కూడా చూడకుండా ఈడ్చిపడేశా రు. పెడరెక్కలు విరిచిపట్టి బలవంతంగా లా క్కెళ్లి వాహనాల్లోకి ఎక్కించారు. మహిళా ఆభ్యర్థుల దుస్తులు ఊడిపోతాయనే జాలి, దయ కూడా లేకుండా ఇష్టానుసారంగా నెట్టిపడేశా రు. పొత్తి కడుపుల్లో గుద్దుతూ, అసభ్యకరంగా తాకుతూ.. పురుష అభ్యర్థులనూ నానా ఇ బ్బందులు పెట్టారు. పొడవాటి కర్రలతో కాళ్లపై కొడుతూ ఎక్కడికక్కడే చెదరగొట్టే ప్రయత్నం చేశారు. వీధుల్లో గుంపులుగా ఉరికిస్తూ లాఠీలతో ఇష్టారీతిన చెలరేగిపోయారు. కోళ్లను కుక్కినట్టు వ్యాన్లలో కుక్కుతూ, కనీసం తాగేందుకు నీళ్లు కూడా ఇవ్వకుండా అమానవీయంగా ప్రవర్తించారు.
దండం పెట్టినా కనికరించలేదు
‘అయ్యా మేము ఎలాంటి ముట్టడి చేయలేదు’ మమ్మల్ని ఎందుకు కొడుతున్నారని అభ్యర్థులు కానిస్టేబుల్ నుంచి ఎస్పీ అధికారి వరకూ చేతులెత్తి దండం పెట్టారు. అయినా ఎవరూ కనికరించలేదు. అందినవారిని అందినట్టు.. రౌడీ మూకలను చెల్లాచెదురు చేసినట్టు ఉద్యోగాల కోసం సిద్ధపడుతున్న వారిపై అ న్యాయంగా లాఠీచార్జి చేశారు. దీంతో ‘ఒక్కొక్కరికి కాళ్లూ, చేతులు వాతలు తేలేలా కొట్టడానికి పోలీసులకు మనసెలా ఒప్పింది’ అని బాధితులు కన్నీటి పర్యమంతమవుతున్నారు. మేము కోరి గెలిపించుకున్న రేవంత్‌రెడ్డే సమాధానం చెప్పాలి’ అని పలువురు బాధితులు కోపంగా ప్రశ్నించారు.
నడిరోడ్డుపై కూర్చొని మహిళా అభ్యర్థి నిరసన
ప్రభుత్వ, పోలీసుల తీరుకు నిరసనగా ఓ మహిళా అభ్యర్థి ఏకంగా అశోక్‌నగర్ చౌరస్తాలో నడిరోడ్డుపై కూర్చొని నిరసన తెలిపింది. ‘మూడ్రోజులుగా నిద్రాహారాలు మాని పో రాటం చేస్తుంటే.. మాకు నరకం చూపిస్తున్నా రు’ అని ఆవేదన వ్యక్తంచేసింది. ‘కనీసం నిరసన తెలుపుకునే అవకాశం కూడా ఇవ్వడంలే దు. ‘ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పు డు మాకు అడ్డగోలు హామీలు ఇచ్చిండు.. ఇప్పుడు కనీ సం మాతో మాట్లాడే తీరిక లేదా? అడిగితే లా ఠీలతో కొట్టిస్తున్నడు’ అంటూ ప్రశ్నించింది.
సోకాల్డ్ ఇంటిలెక్చువల్స్ ఎక్కడ?
‘ఎన్నికలప్పుడు అశోక్‌నగర్, సిటీ లైబ్రరీకి వచ్చిన సోకాల్డ్ ఇంటెలెక్చువల్స్ అంతా ఇప్పుడెక్కడికి పోయారు? ప్రొఫెసర్ కోదండరాం, ఆకునూరి మురళి, రియాజ్, బల్మూరి వెంకట్, తీన్మార్ మల్లన్న వంటి వారు వాళ్ల పదవుల కో సం మాతో ఆటలాడారు. ఆ నాడు మమ్మల్ని మభ్యపెట్టి, ప్రలోభపెట్టి, వాడుకొని.. ఇప్పుడు పదవులు వచ్చాక ఇండ్లలో పడుకున్నరు. ఇదెక్కడి న్యాయం కోదండరాం సార్? ఆకునూరి మురళిగారు ఇప్పుడెందుకు మాట్లాడటం లేదు?’ అని అశోక్‌నగర్‌లో పలువురు అభ్యర్థులు నిలదీశారు. వారంతా తక్షణం స్పందించాలని డిమాండ్ చేశారు.
లాఠీ దెబ్బలు తినేందుకేనా గెలిపించింది?
ఈ లాఠీదెబ్బలు తినేందుకేనా కాంగ్రెస్ పార్టీని గెలిపించింది. పోలీసుల చేత దారుణంగా కొట్టిస్తుంటే మేము చావాలా? బ్రతకాలా? అర్థం కావడం లేదు’ అని పలువురు అభ్యర్థులు వాపోయారు. ఇంత త్వరగా మమ్మల్ని నట్టేట ముంచుతుందని అనుకోలేదు’ అని బాధపడ్డారు. ‘నాడు కాంగ్రెస్‌ను నమ్మి.. ఇదే అశోక్‌నగర్, సిటీ సెంటర్లో ఉ ద్యోగాల కోసం చదువుకునే వాళ్లమంతా గ్రా మాలకు వెళ్లి ప్రచారం చేసి, ఓట్లు వేయించాం. అలాంటి మాపైనే ఇంతటి దౌర్జన్యం చేస్తే మేమెందుకు భరిస్తాం.. అని ప్రశ్నించారు. ‘వెంటనే జీఓ 29ను రద్దు చేయాలి. కోర్టుల్లో ఉన్న కేసులన్నీ తేలేంతవరకూ పరీక్షను నిర్వహించొద్దు. తక్షణం గ్రూప్-1ను రీషెడ్యూల్ చేయాలి’ అని డిమాండ్ చేశారు. పోలీసులు కొట్టిన దెబ్బలకు పలువరు గ్రూప్-1 అభ్యర్థులు దవాఖానల్లో చేరినట్టు చెప్పారు.
21 వరకూ దుకాణాలు బంద్
అశోక్‌నగర్‌లో శుక్రవారం ఉదయం నుంచే హోటళ్లు, టీ స్టాళ్లు, దుకాణాలు, ఇతర షాపులను పోలీసులు బలవంతంగా బంద్ చేయించారు. ఈనెల 21 వరకూ అశోక్‌నగర్‌లో వి ద్యార్థులు గుమికూడే ప్రదేశాల్లో దుకాణాలు, షాపులు తెరిస్తే.. పరిణామాలు చాలా కఠినం గా ఉంటాయని పోలీసులు హెచ్చరించినట్టు దుకాణాల యజమానులు చెప్తున్నారు.
ఉదయం నుంచే భారీగా మోహరింపు
గ్రూప్-1 అభ్యర్థులు శుక్రవారం కూడా ఆందోళనలు చేపడతారన్న సమాచారం మేరకు చిక్కడపల్లికి ప్రత్యేక పోలీస్ బలగాలను రప్పించారు. స్పెషల్ పార్టీ పోలీసులతో అశోక్‌నగర్, సిటీ సెంట్రల్ లైబ్రరీ ప్రాంతాల్లో గల్లీల్లో గాలించారు. అశోక్‌నగర్‌లో ఏ చౌరస్తా చూసినా, ఏ గల్లీ చూసినా, ఏ రోడ్డు చూసినా పోలీసులే దర్శనమిచ్చారు. 400 మంది పోలీసులతో అశోక్‌నగర్‌ను చుట్టుముట్టి.. ఆందోళనలతో సంబంధంలేని వారిని కూడా అరెస్టుచేశారు. వారిపైనా లాఠీలు ఝుళిపించారు. అపార్ట్మెంట్లలో దాక్కున్నా వారినీ వెతికి పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అశోక్‌నగర్‌లో మధ్యాహ్నం అభ్యర్థులు శాంతియుతంగా సమావేశమైతే, అక్కడకూ చేరుకొని ఉరికించి కొట్టారు. వారు ఉంటున్న హాస్టల్ గదులకు, స్టడీ హాళ్లకు వచ్చి, లైబర్రీలు, బుక్ సెంటర్ల వద్ద వేచి ఉన్న నిరుద్యోగులందరినీ కొట్టారు. ‘ఆ లాఠీ దెబ్బలను చూస్తుంటే.. మేమేనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు వేసింది? ఇందుకేనా కాంగ్రెస్‌ను గెలిపించుకున్నది? తెలంగాణ ఉద్యమంలో నిరుద్యోగులు ఎలాగైతే లాఠీ దెబ్బలు తిన్నారో? మళ్లీ అదే పరిస్థితి అదే కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చింది’ అని పలువురు అభ్యర్థులు ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తంచేశారు.
మెయిన్స్‌కు ఎంపికైనా ఆందోళన చేస్తున్నాం
గ్రూప్-1 మెయిన్స్‌కు ఎంపికైన మేము రాసేందుకు సిద్ధంగా ఉన్నాం. అయినా జీవో 29 రద్దు కోసం పోరాడుతున్నాం. మేమే ఆందోళనలో పాల్గొంటున్నామంటే అందులో ఎంత అన్యాయం ఉన్నదో అర్థం చేసుకోండి. మంత్రులను కలిసిశాం. కోర్టుల్లో న్యాయపోరాటం చేసినం. ఫలితం లేకే రోడ్డుపైకి రావాల్సి వచ్చింది. రూల్ ఆఫ్ రిజర్వేషన్ లేకుండా ఎందుకు అమలు చేస్తున్నారు. ప్రిలిమ్స్‌లో కూడా ప్రశ్నలు తప్పున్నాయి. మెయిన్స్ రీ షెడ్యూల్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇంత ఆగమేఘాల మీద పెట్టాల్సిన అవసరం లేదు.
-గ్రూప్-1 మహిళా అభ్యర్థి
నేడు హైదరాబాద్‌లో..
హైదరాబాద్ అశోక్‌నగర్ క్రాస్ రోడ్స్‌లో శుక్రవారం ఉదయం తియానన్మెన్ స్కేర్‌లో జరిగిన నాటి ఘటన మళ్లీ ఆవిష్కృతమైంది. గ్రూప్-1 పరీక్షను వాయిదా వేయాలని, జీవో 29ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఓ అభ్యర్థి రోడ్డుపై వాహనాలకు అడ్డంగా కూర్చొని ఆందోళన చేపట్టింది. డిమాండ్ల సాధన కోసం ఎన్నో రోజులుగా గ్రూప్-1 అభ్యర్థులు శాంతియుతంగా ఆందోళన చేస్తున్నా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పట్టించుకోకపోగా.. విద్యార్థులపై లాఠీలను జుళిపించి, వారిపై దమనకాండకు దిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని విధాలుగా అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నా.. ఆ యువతి ప్రదర్శించిన పోరాటపటిమ మరెందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచింది.
ఏడాదిలోపే 2 లక్షల ఉద్యోగాలిస్తాం
‘హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌లో వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతను కలిశాను. తెలంగాణ వస్తే తమకు కొలువు లు వస్తాయని ఆశించామని, రాష్ట్రం వచ్చి పదేండ్లయినా తమ ఆకాంక్షలు నెరవేరలేదని వారు ఆవేదన వ్యక్తం చేయడం నన్ను కలిచివేసింది. కేసీఆర్ పదేండ్ల పాలనలో తెలంగాణ యువతకు న్యాయం జరగలేదు. వారి కలలు సాకారమయ్యేలా.. కాంగ్రెస్ ప్రభు త్వం ఏర్పడిన ఏడాదిలోపే, 2 లక్షల ఉద్యోగ నియామకాలను పూర్తిచేసి యువతకు ఇ చ్చిన మాట నిలబెట్టుకుంటాం’
ఇది 25-11-2023న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ చేసిన ట్వీట్ సారాం శం. అంతకు ముందు రాహుల్‌గాంధీ అశోక్‌నగర్, సిటీసెంట్రల్ లైబ్రరీలో నిరుద్యోగులను కలిశారు. వారిలో చాయ్ తాగుతూ ముచ్చటించారు.