భీమారం, మే 21 : మంచిర్యాల జిల్లా భీమారం మండలం అంకుశాపూర్ శివారులోని అటవీ భూమిలో మంగళవారం హద్దు లు వేసేందుకు వచ్చిన అధికారులను పోడు రైతులు అడ్డుకోవడం వివాదానికి దారి తీసిం ది. సర్వే నంబర్ 140లో మంచిర్యాల రేంజర్ రత్నాకర్‌రావు ఆధ్వర్యంలో జేసీబీతో స్ట్రెంచ్ వేస్తుండగా, పోడు రైతులు వాగ్వాదానికి దిగి జేసీబీని అడ్డుకున్నారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. కేసీఆర్ సర్కారులో ఎవరూ తమ భూముల వద్దకు రాలేదని, ఫారె స్ట్ అధికారులు తమను నిత్యం బెదిరిస్తున్నార ని ఆవేదన వ్యక్తం చేశారు. విధులకు ఆటంకం కలిగిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని రేంజర్ రత్నాకర్‌రావు తెలిపారు.