చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారి గుడిలో తడిబట్టలతో ప్రమాణం చేస్తవా?
పోక్సో కేసులో తనకు, తన కుమారుడికి సంబంధంలేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ తడిబట్టలతో చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారి ఎదుట, యాదగిరిగుట్ట నరసింహస్వామి ఎదుట ప్రమాణం చేస్తారా అని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి సవాల్ విసిరారు. గతం లో పలు సందర్భాల్లో తడిబట్టలతో ప్రమాణం అని డ్రామాలు చేశారని, యాదగిరిగుట్టలో సైతం హంగామా చేశారని ఆమె గుర్తుచేశారు.
- బెదిరించిన సంజయ్‌పైనా పోక్సో కేసు పెట్టాలి
- తప్పు చేయకుంటే భగీరథ్ పారిపోవడమెందుకు?
- ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి
- ఎన్కౌంటర్ చేయాలి: కల్లూరి రామచంద్రారెడ్డి
యాదాద్రి భువనగిరి, మే 12(నమస్తే తెలంగాణ) : పోక్సో కేసులో తనకు, తన కుమారుడికి సంబంధంలేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ తడిబట్టలతో చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారి ఎదుట, యాదగిరిగుట్ట నరసింహస్వామి ఎదుట ప్రమాణం చేస్తారా అని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి సవాల్ విసిరారు. గతం లో పలు సందర్భాల్లో తడిబట్టలతో ప్రమాణం అని డ్రామాలు చేశారని, యాదగిరిగుట్టలో సైతం హంగామా చేశారని ఆమె గుర్తుచేశారు. బాధితులు, బాధిత కుటుంబాన్ని బెదిరించిన బండి సంజయ్‌తోపాటు బీజేపీ నేత సంగప్ప పైనా పోక్సో కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. మంగళవారం భువనగిరి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆమె మాట్లాడారు. పోక్సో కేసు నమోదై రోజులు గడుస్తున్నా భగీరథ్‌ను అరెస్ట్ చేయకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు. నిందితుడు పరారీలో ఉన్నారని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పడం సిగ్గుచేటని విమర్శించారు.
పోక్సో కేసులో కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి డ్యామేజ్ జరుగుతున్నదని భావించి.. పరువు కాపాడుకునేందుకే సిట్‌ను తెరపైకి తె చ్చారని మండిపడ్డారు. భగీరథ్ తప్పు చేయకుంటే ఎం దుకు పరారీలో ఉన్నాడో చెప్పాలని నిలదీశారు. భగీరథ్ అంశం తమ పార్టీకి సంబంధం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అనడం సిగ్గుచేటన్నారు. భగీరథ్‌కు సంబంధం లేకపోతే హనీట్రాప్ కేసు ఎలా పెట్టారని ప్ర శ్నించారు. 24గంటల్లో అరెస్ట్ చేసి, జడ్జి ఎదుట హాజరు పరుచాలని డిమాండ్ చేశారు. విచారణలో తప్పు చేశారని తేలితే ఎన్కౌంటర్ చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కల్లూరి రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. గతంలో ఇలాంటి ఘటనల్లో ఎన్కౌంటర్లు చేస్తే.. ప్రజలు హర్షించారని గుర్తుచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | రేవంత్ రెడ్డి పాలమూరు ద్రోహి.. మళ్లీ ఈ జిల్లాలో వలసలు మొదలైనయి : హరీశ్ రావు
Palamuru Lift | ఫలించిన సింగిరెడ్డి వ్యూహం..ఎట్టకేలకు పాలమూరు లిఫ్ట్ ప్రారంభం
Akhilesh Yadav | అఖిలేష్ యాదవ్‌కు షాక్.. బీజేపీలో చేరిన ఎస్పీ రెబల్ ఎమ్మెల్యేలు
Prabhas | ‘కల్కి 2’ సెట్స్‌లోకి రెబల్ స్టార్ ప్రభాస్.. త్వరలో ప్రారంభం కానున్న భారీ షెడ్యూల్!
రైతుల వ్యథలు పట్టించుకోని ప్రభుత్వం : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

