కొండపాక(కుకునూరుపల్లి), ఫిబ్రవరి 22 : సిద్దిపేట జిల్లా ఖమ్మంపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల జీవశాస్త్ర ఉపాధ్యాయుడు కేసుగాని దేవయ్యపై పోక్సో కేసు నమోదైంది. దేవయ్య ఓ విద్యార్థినిని సైన్స్ ల్యాబ్‌లోకి పిలిచి పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
హెచ్ఎం, విద్యార్థినుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు త్రీ టౌన్ సీఐ విద్యాసాగర్ షీ టీమ్‌తో వచ్చి దేవయ్యను అదుపులోకి తీసుకున్నారు. అతడిపై పోక్సో కేసు నమోదు చేశారు.