హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ) : పీఎం కుసుమ్ కింద చేపట్టిన సోలార్ పవర్ ప్రాజెక్ట్‌ల కమిషనింగ్ గడువును వచ్చే ఏడాది మార్చి నెలాఖరు వరకు పొడిగించారు. ఈ మేరకు తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) మంగళవారం ఆర్డర్ పాస్ చేసింది.
కమిషనింగ్ గడువు ఈ ఏడాది మార్చి 30తో ముగిసింది. అయినా ప్రాజెక్ట్‌లు పూర్తికాకపోవడంతో మార్చి 31, 2027లోగా పూర్తిచేసి కమిషనింగ్ చేయాలని ఈఆర్సీ ఆదేశించింది.