నర్సింహులపేట, మే 13 : ‘మేము చెప్పిన ఈ-మెయిల్ అడ్రస్‌కు రూ.500 పంపిస్తే మూడు నెలల తర్వాత రూ.15 వేలు మీ అకౌంట్లో జమ చే స్తాం’ అంటూ గుర్తుతెలియని వ్యక్తులు గురుకుల పాఠశాలలు, కేజీబీవీల్లో చదువుకునే పేద విద్యార్థినుల తల్లిదండ్రులకు ఫోన్చేస్తున్నారు. ఈ సరికొత్త దందా మహబూబాబాద్ జిల్లాలో వెలుగుచూసింది. తొర్రూరు రెవెన్యూ డివిజన్ వ్యాప్తంగా గురుకుల, కేజీవీబీ విద్యార్థినుల తల్లిదండ్రులకు కొద్దిరోజులుగా ఫోన్లు వస్తున్నాయి. ‘ఈడీ- సీఎస్ఆర్ స్కాలర్షిప్’ పేరిట ఆన్లైన్ మోసం చేస్తున్నారు.
పేద విద్యార్థినులు రూ.500ను ww.edcsr.com. ఈ-మెయిల్ అడ్రస్ help@edcsr. cowకు పంపిస్తే మూడు నెలల తర్వాత రూ.15 వేలు మీ ఖాతాలో జమ చేస్తామని చెబుతూ 8019329025 నంబర్ నుంచి విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్లో ఆశ చూపిస్తున్నారు. దీంతో అమాయక తల్లిదండ్రులు ఆధార్ సెంటర్‌కు వెళ్లి విద్యార్థుల వివరాలు నమోదు చేయిస్తున్నారు. ఇలాంటివి నమ్మకూడదని భవిష్యత్‌లో ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉన్నదని విద్యావేత్తలు చెప్తున్నారు.