హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ) : దేశంలో పెట్రోల్ ధర తెలంగాణలోనే ఎక్కువగా ఉన్నదని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ కిషన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. తెలంగాణలో పెట్రోల్‌పై వ్యాట్ 35.26 రూపాయలు ఉన్నదని, ఈ ధరను ఎందుకు తగ్గించడం లేదని సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. ఆదివారం నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్మీట్లో కిషన్‌రెడ్డి మాట్లాడారు. లీటర్‌కు మూడు రూపాయలు పెరిగితే దీంట్లో 35 శాతం ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్నదని పేర్కొన్నారు. కాంగ్రెస్ రైతులను మోసం చేస్తున్నదని, ధాన్యం కొనుగోళ్ల ప్రతి పైసా కేంద్రానిదేనని తెలిపారు. కొనుగోళ్ల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, మంత్రులు జిల్లాలకు వెళ్లి పర్యవేక్షించాలని వెల్లడించారు. బండి భగీరథ్ అంశంపై స్పందించిన కిషన్‌రెడ్డి.. ‘ఆయన అరెస్ట్ అయ్యాడు కదా..’ అంటూ వ్యాఖ్యానించారు. పోలీసుల విచారణ జరుగుతున్నది. రాష్ట్ర పోలీసులపై కేంద్ర పెత్తనం ఉండబోదని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.