హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను స వాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. కేవలం పత్రికల్లో వచ్చిన వా ర్తల ఆధారంగా పిటిషన్ దాఖలు చేయడం పై పిటిషనర్ మీద హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బీసీల రిజర్వేషన్లను 42 శాతానికి పెంపుదల చేస్తే, మొత్తం రిజర్వేషన్లు 68 శాతానికి చేరుతాయన్న పిటిషన ర్ ఆందోళనను ప్రాథమిక దశలోనే తోసిపుచ్చింది. ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు ఏ విధమైన ఆధారాలు లేకుండా పిటిషన్ వేయడాన్ని ఆక్షేపించింది. సుప్రీంకోర్టు ఫెర్నాండెజ్ కేసులో వెలువరించిన తీర్పు ప్రకారం పత్రికల వార్తల ఆధారంగా పిటిషన్ దాఖలు చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని సుప్రీంకోర్టు, రాజ్యాంగం స్పష్టం చేస్తున్నాయని తెలిపింది. ప్రభుత్వ నిర్ణ యం అధికారికంగా వెలువడిన తరువాత పిటిషన్ దాఖలు చేసుకునే స్వేచ్ఛ కల్పించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరగా, ఆ స్వేచ్ఛ పిటిషనర్‌కు ఎప్పుడూ ఉంటుందని స్పష్టంచేసింది.
మేడ్చల్ మలాజిగిరి జిల్లా మూడుచింతలపల్లి మండలం కేశవాపూర్‌కు చెందిన సామాజిక కార్యకర్త బు ట్టెంగారి మాధవరెడ్డి, సిద్దిపేట జిల్లా కొం డూరుకు చెందిన జల్లపల్లి మల్లవ్వ దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేస్తూ బుధవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కేలక్ష్మణ్ తీర్పు వెలువరించారు. పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది మయూర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, ఇప్పుడు రాష్ట్రంలో బీసీలకు 26%, ఎస్సీలకు 15%, ఎస్టీలకు 9% రిజర్వేషన్లు ఉన్నాయని తెలిపారు. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తే రిజర్వేషన్ల పరిమితి 50 నుంచి 68 శాతానికి పెరగుతుందని, అది చట్ట వ్యతిరేకమని చెప్పారు. పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285ఏ ను తొలగించి బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పించడానికి శాసనసభ తీర్మానించిందని చెప్పారు. ఈ తీర్మానానికి గవర్నర్, రాష్ట్రపతి ఆమోదం తెలుపలేదని అన్నారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. ప్రభుత్వం ఏవిధమైన నిర్ణయం తీసుకోకుండానే పిటిషన్ ఎలా దాఖలు చేస్తారని పిటిషనర్‌ను ప్రశ్నించింది. క్యాబినెట్ తీర్మానం చేసినట్టుగా పత్రికల్లో వార్తలు వచ్చాయన్న జవాబు పట్ల హైకోర్టు అసంతృప్తి వ్యక్తంచేసింది.