హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం కారణంగా ఆదివారం నుంచి నాలుగు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షంతో పాటు గంటకు 30-40కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నట్టు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. జోగులాంబ-గద్వాల,రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడి, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, మహబూబ్నగర్ జిల్లాల్లో అకడకడ ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. ఆయా జిల్లాలకు ఎల్లోఅలర్ట్ జారీ చేశారు. నేడు మేడ్చల్-మలాజిగిరి,భూపాలపల్లి, హైదరాబాద్, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్, సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి,వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్నగర్, జనగామ, నాగర్కర్నూల్, నారాయణపేట, వరంగల్, హనుమకొండ, వనపర్తి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయన్నారు. గడిచిన 24 గంటల్లో జనగామలో అత్యధికంగా 3.40 సెం.మీ, జోగులాంబ-గద్వాల జిల్లా రాజోలిలో 3.06 సెం.మీ, రాజన్న -సిరిసిల్ల జిల్లా వేములవాడలో 2.52 సెం.మీ, జనగామ జిల్లా బచ్చన్నపేటలో 2.45 సెం.మీ, కామారెడ్డి జిల్లా పిట్లంలో 2.27 సెం.మీ, రామారెడ్డిలో 2.06 సెం.మీ, లింగంపేటలో 1.96 సెం.మీ, పాల్వంచలో 1.87 సెం.మీ, సంగారెడ్డి జిల్లా కంగ్టిలో 2.11 సెం.మీ చొప్పున వర్షపాతం నమోదైనట్టు తెలిపారు.