గురువారం 13 ఆగస్టు 2020
Telangana - Jul 10, 2020 , 13:34:05

దీర్ఘకాలిక వ్యాధులున్న వారికే కరోనాతో సమస్యలు

దీర్ఘకాలిక వ్యాధులున్న వారికే కరోనాతో సమస్యలు

హైదరాబాద్‌: దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారే కరోనా వల్ల సమస్యలు ఎదుర్కొంటున్నారని హైదరాబాద్‌ సీపీ అంజనీ కుమార్‌ అన్నారు. దేశంలో ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో కరోనా ప్రభావం తక్కువేనని చెప్పారు. కరోనా నుంచి కోలుకున్న 45 మంది పోలీసు సిబ్బందిని సీపీ విధుల్లోకి ఆహ్వానించారు. పశ్చిమ మండల పరిధిలోని పలు పోలీస్‌ స్టేషన్లకు చెందిన వీరంతా ఈరోజు విధుల్లో చేరారు. 

లాక్‌డౌన్‌, వలస కూలీల తరలింపులో పోలీసులు కీలక పాత్రవహించారని తెలిపారు. విపత్కర పరిస్థితుల్లో పోలీస్‌ శాఖ సేవలు చిరస్మరణీయమని అన్నారు. పోలీసులు కరోనా నుంచి త్వరగా కోలుకుని విధుల్లో చేరడం సమాజానికే ఆదర్శమని చెప్పారు. కోలుకున్నవారు ఇతరులకు కరోనాపై అవగాహన కల్పించి ధైర్యం చెప్పాలని సూచించారు.

తాజావార్తలు


logo