తొర్రూరు, జూన్ 22 : నాట్లకు నాట్లకు మధ్య రైతుబంధు ఇచ్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. అయితే కాంగ్రెస్ సర్కార్ ఓట్లకు ఓట్లకు మధ్య రైతుభరోసా ప్రకటించి, మధ్యలో రెండుసార్లు ఇవ్వకుండా ఎగ్గొట్టిందని విమర్శించారు. ఇది రైతులకు అర్థమయ్యేలా వివరించాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని పేరొన్నారు.
ఆదివారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పాలకుర్తి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించాలంటే ప్రతి ఒక్కరూ సమష్టిగా పని చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత 420 హామీలు ఇచ్చి ప్రజలను తప్పుదారి పట్టించిందని విమర్శించారు. అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ సర్కార్ ఒక హామీని కూడా సరిగా అమలు చేయలేదని మండిపడ్డారు.