నవాబ్‌పేట, జూలై 26 : మహబూబ్‌నగర్ జిల్లా కిషన్‌గూడ పంచాయతీలోని గుబ్బడిగుచ్చతండాను డెంగీ వణికిస్తున్నది. ఒకే ఇంట్లో అన్నాచెల్లెళ్లు లావుడ్యా పాండు(28), అక్షర(19) డెంగీ బారినపడ్డారు.
అదే తండాకు చెందిన లావుడ్యా నరేశ్(22)కు కూడా డెంగీ జ్వరం సోకడంతో జిల్లా దవాఖానలో చేరారు. విషయం తెలుసుకున్న వైద్య సిబ్బంది శనివారం తండాకు వెళ్లి వీధుల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లి ఫీవర్ సర్వే నిర్వహించారు.