హైదరాబాద్ : రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్లినా కాంగ్రెస్ పార్టీ(,Congress) చేస్తున్న అబద్ధపు ప్రచారాలను ప్రజలు తరిమి కొడుతున్నారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా(Mahabubnagar )అడ్డాకుల మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద ప్రజా పాలన విజయోత్సవాల కళాకారుల వాహనాన్ని ప్రజలు అడ్డుకున్నారు. ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి కాంగ్రెస్ తీరా గెలిచాక మాట తప్పిందన్నారు. ఆరు గ్యారెంటీలు ఎక్కడ అమలు అయ్యాయని కళాకారులను నిలదీశారు. హామీలు అమలు చేయకుండానే ఎలా ప్రచారం చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో చేసేదేమి లేక అక్కడి నుంచి కళాకారులు తిరుగుపయనమయ్యారు.
బిగ్ బ్రేకింగ్ న్యూస్
గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అబద్ధపు ప్రచారాలను తరిమి కొడుతున్న ప్రజలు
సీఎం గారి సొంత జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం
మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద ప్రజా పాలన విజయోత్సవాల వాహనాన్ని అడ్డుకున్న జనం
ప్రజా పాలన… pic.twitter.com/E9YRGeB9fo
— Telugu Scribe (@TeluguScribe) November 21, 2024