సిటీబ్యూరో, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): అత్యవసర డయల్-100 ఫిర్యాదును పట్టించుకోకుండా విధుల్లో నిర్లక్ష్యం వహించిన రాయదుర్గం పోలీస్ స్టేషన్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ సయ్యద్ యూనస్ (హెచ్ సీ-661)ను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేశ్ సస్పెండ్ చేశారు. ఆగస్టు 1 అర్ధరాత్రి గచ్చిబౌలి ఐకియా సమీపంలో జరిగిన రెండు కార్లు ఢీకొన్న ఘటనలో బాధితుడు డయల్-100కు రెండు సార్లు ఫోన్ చేసి పోలీసు సహాయం కోరాడు. ఇన్చార్జిగా ఉన్న హెడ్‌కానిస్టేబుల్ సయ్యద్ యూనస్ ఘటనా స్థలానికి వెళ్లకుండా ‘కాలర్ వల్ల ఇబ్బంది’ అంటూ రెండు ఫిర్యాదులను మూసివేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటనను సీరియన్‌గా తీసుకున్న సైబరాబాద్ సీపీ హెడ్‌కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు. శాఖాపరమైన విచారణ పూర్తయ్యే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని సీపీ ఉత్తర్వుల్లో పేరొన్నారు.