దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘శ్రీశ్రీ’. పూజా హెగ్డే కథానాయిక. రవి నెలకుదిటి దర్శకుడు. చెరుకూరి సుధాకర్ నిర్మాత. ఇషాన్ సక్సేనా సహ నిర్మాత. తాజాగా ఈ సినిమా ఫారిన్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ షెడ్యూల్లో అత్యంత కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించామని, ఈ సన్నివేశాలు సినిమాకు హైలైట్స్‌గా నిలువనున్నాయని మేకర్స్ తెలిపారు.
ప్రేమ, వినోదం, భావోద్వేగాలతో కూడిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇదని, త్వరలోనే రిలీజ్ డేట్‌ని ప్రకటిస్తామని మేకర్స్ చెప్పారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ పాన్ ఇండియా చిత్రానికి కెమెరా: అనయ్ ఓం గోస్వామి, సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్, నిర్మాణం: ఎల్ఎల్వీ సినిమాస్.