హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తేతెలంగాణ) : రైల్వే శాఖ వారణాసిలోని బనారస్ లోకోమోటివ్ వర్క్స్ (బీఎల్డబ్ల్యూ) 2026-27 సంవత్సరానికి స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 25 పోస్టులకు గానూ 18 నుంచి 25 ఏండ్ల లోపు ఉన్న క్రీడాకారులు అక్టోబర్ 12 లోపు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. అభ్యర్థులను నిబంధనల ప్రకారం ట్రయల్స్‌కు పిలిచి, క్రీడా ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తామని, ఎలాంటి రాత పరీక్ష ఉండదని పేర్కొన్నారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రతినిధులతో ఈ నెల 18న సీఎస్ సంజయ్‌జాజు ఉదయం 11 గంటలకు సచివాలయంలో చర్చలు జరుపనున్నారు. ఈ నెల 9న ఒకసారి చర్చలు జరిగాయి. శుక్రవారం మరోసారి సమావేశమై చర్చలు జరుపనున్నారు.