ఇంధనం కోసం బారులు
పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా వంట గ్యాస్‌తోపాటు, పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడిందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
- కొరతలేదంటున్న అధికారులు
- వినియోగదారుల్లో తగ్గని ఆందోళన
నమస్తే తెలంగాణ నెట్వర్క్, మార్చి 25: పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా వంట గ్యాస్‌తోపాటు, పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడిందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీంతో పెద్ద ఎత్తున వాహనదారులు బంక్‌ల వద్దకు చేరుకొని బారులుతీరుతున్నారు. పెట్రోల్ కొరత లేదని అధికారులు చెప్తున్నా వాహనదారులు మాత్రం పెట్రోల్, డీజిల్ కోసం బంకుల వద్దకు పరుగులు తీస్తున్నారు. దీంతో అనేకచోట్ల బంకులన్నీ వాహనదారులతో కిటకిటలాడుతున్నాయి. కొన్ని బంక్‌ల వద్ద డీజిల్, పెట్రోల్ లేకపోవడంతో నోస్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. వివిధ ట్రాన్స్పోర్ట్ వాహనదారులు క్యాన్లు, బ్యారళ్లతో వచ్చి క్కూలో నిలబడి పెట్రోల్, డీజిల్ తీసుకెళ్తున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోనూ అనేక బంకులు స్టాక్ లేక మూసి ఉంచగా, స్టాక్ ఉన్న చోట వాహనదారులు పెద్ద సంఖ్యలో బారులుతీరారు. నిజామాబాద్, కోటగిరి, వేల్పూర్, కామారెడ్డి, ఎల్లారెడ్డి తదితర ప్రాంతాల్లో పెట్రోల్ బంకులు వాహనదారులతో కిటకిటలాడాయి. మరోవైపు, అందరూ ట్యాంకులు ఫుల్ చేయించుకోవడంతో స్టాక్ దొరకని పరిస్థితి ఏర్పడింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

