పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని కోరుతూ సోమవారం మహబూబాబాద్ కలెక్టరేట్ ఎదుట మాజీ సర్పంచ్‌లు ధర్నా చేశారు. అనంతరం కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ల ఫోరం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బోడ లక్ష్మణ్‌నాయక్ మాట్లాడుతూ మే నెలలో సర్పంచ్ల బిల్లులను క్లియర్ చేస్తున్నామని చెప్పిన ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని చెప్పారు.
మాయమాటలు చెప్పి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే మాజీ సర్పంచ్‌లు, ప్రజలందరినీ కలుపుకుని ప్రభుత్వానికి గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఈ నెల 20 లోపు బిల్లులు చెల్లించకపోతే జిల్లాలోని 461 మంది మాజీ సర్పంచ్‌లతో కలిసి కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.