కొడంగల్/బొంరాస్‌పేట, మార్చి 5: పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి కోరారు. బుధవారం ఆయన కొడంగల్‌లోని కడా కార్యాలయంలో వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్‌జైన్‌ను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. బీఆర్ఎస్ హయాంలో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు గ్రామాల అభ్యున్నతికి సొంత నిధులను వెచ్చించి చేపట్టిన పనులకు సంబంధించిన బిల్లులను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ) : ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎప్‌సెట్ దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతున్నది. ఇప్పటి వరకు దరఖాస్తులు 50 వేలకు చేరువలో ఉన్నాయి. బుధవారం వరకు 48,158 దరఖాస్తులు వచ్చినట్టు కన్వీనర్ ప్రొఫెసర్ డీన్‌కుమార్ తెలిపారు. ఇంజినీరింగ్‌కు 31,805, అగ్రికల్చర్, ఫార్మసీకి 16,317, రెండు పేపర్లకు 36 చొప్పున మొత్తం 48,158 మంది దరఖాస్తు చేసుకున్నట్టు వెల్లడించారు.