Peddi Sudarshan Reddy | సీఎం రేవంత్‌రెడ్డి వందమంది రౌడీ షీటర్లతో సమానమని బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. కేసీఆర్‌పై రేవంత్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణను సాధించి.. దేశంలోనే అగ్రభాగాన నిలిపిన కేసీఆర్‌కు తెలంగాణలో జీవించే హక్కులేదనడం రేవంత్‌రెడ్డి దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. రేవంత్‌రెడ్డి పెద్ద జోకర్, తెలంగాణ ద్రోహి అంటూ మండిపడ్డారు. పరిపాలన చేతకాక ఇలా ప్రజల మధ్య, కులాల మధ్య, మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నాడని మండిపడ్డారు. తెలంగాణ కోసం పోరాటం చేసి.. సాధించిన యోధుడు కేసీఆర్ అన్నారు.
హైదరాబాద్‌ను ప్రపంచంలోనే ఐటీలో మేటిగా నిలిపిన నేత కేటీఆర్ అన్నారు. సాగునీటి రంగంలో విప్లవాన్ని తీసుకొచ్చిన నేత హరీశ్ రావు అని.. అలాంటి నేతలను తెలంగాణలో జీవించే హక్కులేదనటం సీఎం వెకిలి మనస్తత్వానికి నిదర్శనమన్నారు. రేవంత్‌రెడ్డి తెలంగాణ ద్రోహి అని.. ఓటుకు నోటు దొంగ, 420 అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ఏనాడూ కక్ష పూరిత రాజకీయాలు చేయలేదని.. బిడ్డా నోరు అదుపులో పెట్టుకోవాలని.. చిల్లర కూతలు ఆపాలని.. లేకుంటే ప్రజలే తరిమికొడుతారని హెచ్చరించారు. నీ పాలనలో ఒక్క కార్యక్రమమైనా విజయవంతంగా నిర్వహించావా? కేసీఆర్‌ను తిట్టడం తప్ప చేసింది ఏమీ లేదన్నారు.