ఇల్లెందు, జనవరి 3: పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలనే డిమాండ్‌తో పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో శనివారం భారీ ప్రదర్శన నిర్వహించారు.
పీడీఎస్‌యూ జిల్లా మాజీ సహాయ కార్యదర్శి సారంగపాణి, జిల్లా నాయకుడు గణేశ్ మాట్లాడుతూ.. విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని మండిపడ్డారు. రాష్ట్ర బడ్జెట్లో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగానికి 15 శాతం నిధులు కూడా కేటాయించలేదని దుయ్యబట్టారు. విద్యార్థుల బస్‌పాస్ ధరల పెంపు సరికాదన్నారు.