మూసీ కేసును ఎన్జీటీ డిస్మిస్ చేయలేదు
మూసీ ప్రాజెక్టుపై తాను వేసిన కేసును నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ డిస్మిస్ చేయలేదని, ప్రస్తుతం దరఖాస్తు దశలో ఉన్నందున డిస్పోస్ చేసిందని బీఆర్ఎస్ నేత పటోళ్ల కార్తీక్‌రెడ్డి తెలిపారు.
- సీఎం పరపతి కోసమే ప్రాజెక్టు
- ప్రజల కోణంలో అభివృద్ధి చేయకుంటే అడ్డుకుంటాం
- బీఆర్ఎస్ నేత పటోళ్ల కార్తీక్‌రెడ్డి
హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తేతెలంగాణ): మూసీ ప్రాజెక్టుపై తాను వేసిన కేసును నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ డిస్మిస్ చేయలేదని, ప్రస్తుతం దరఖాస్తు దశలో ఉన్నందున డిస్పోస్ చేసిందని బీఆర్ఎస్ నేత పటోళ్ల కార్తీక్‌రెడ్డి తెలిపారు. శనివారం తెలంగాణభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. చట్టబద్ధంగా అన్నీ ప్రక్రియలు పూర్తిచేసిన తర్వాతే ముందుకెళ్తామని ఎన్జీటీకి ప్రభుత్వం చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. లేదంటే తిరిగి తమ వద్దకు రావాలని ఎన్జీటీ సూచించిందని వెల్లడించారు.
అసెంబ్లీలో సర్కార్ చెప్పని వివరాలను సైతం ఎన్జీటీ ఎదుట చెప్పించామని పేర్కొన్నారు. కోర్టుకు చెప్పిన అంశంలో ఏ ఒక్కటి చేయకపోయినా తిరిగి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని ప్రకటించారు. రాష్ట్రం కోసం, తెలంగాణ ప్రజల కోసం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మూసీ రివర్ ప్రాజెక్ట్‌ను చేపట్టడంలేదని ఆరోపించారు. ప్రధాని మోదీ సబర్మతి రివర్‌ఫ్రంట్ చేసిన విధంగా తన పరపతి పెంచుకొనేందుకే మూసీని ముందుకుతెచ్చారని దుయ్యబట్టారు. ప్రజల కోణంలో పనులు చేయకపోతే అడ్డుకొని తీరుతామని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

