కోస్గి, జూన్ 20: రాష్ట్రంలోని రైతులు, ప్రజల సంక్షేమాన్ని రేవంత్ సర్కార్ పూర్తిగా విస్మరించిందని కొడంగ ల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి విమర్శించారు. మహబూబ్‌నగర్ జిల్లా కోస్గి మండల బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో కలిసి హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను దగా చే స్తున్నదని ఆరోపించారు. రేవంత్‌ది పథకాలు ఎగ్గొట్టే ప్రభుత్వంగా మారిందని తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పటివరకు రైతులకు ఇవ్వాల్సిన రైతుభరోసా ఎగ్గొట్టిందని, రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయలేదని దుయ్యబట్టారు. కల్యాణలక్ష్మి పథకం కింద తులం బంగారాన్ని ఎగ్గొట్టిందని ఎద్దేవా చేశా రు. అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కావడం లేదని అన్నారు.