ముఖ్యమంత్రికి రియల్ ఎస్టేట్ మీద ఉన్న ధ్యాస రైతులపై లేదని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి విమర్శించారు. ఎందుకు వారోత్సవాలు నిర్వహిస్తున్నారో వాళ్లకే తెలియదని అన్నారు. కొడంగల్లో ఎంతమందికి రుణమాఫీ అయ్యిందో చర్చకు సిద్దమా అని సవాలు విసిరారు. వంద శాతం రుణమాఫీ చేస్తే మళ్లీ నేను ఎమ్మెల్యేగా పోటీ చేయనని స్పష్టం చేశారు.
వికారాబాద్ జిల్లా బొంరాస్పేట మండలం మెట్లకుంటలో వడ్ల కల్లాల దగ్గర బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. 20 రోజులుగా కల్లాల్లోనే వడ్లు ఉన్నాయని.. వెంటనే వడ్లు కొనాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఆందోళనలతో రైతుబంధు వేస్తున్నాడని పట్నం నరేందర్ రెడ్డి తెలిపారు.