హైదరాబాద్,జూలై 21 (నమస్తే తెలంగాణ): నీట్ పేపర్ లీకేజీకి బాధ్యులైన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఇతరులను వెంటనే చట్టం ముందు నిలబెట్టాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు.
బాధ్యులను శిక్షించాలని విద్యార్థులు, యువత ఆందోళన చేస్తుంటే వారిపై దాడులు చేయడం గర్హనీయమని పేర్కొన్నారు. మంగళవారం ఆయన ఎక్స్ వేదికగా కేంద్ర ప్రభుత్వం, పోలీసుల చర్యలను తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు #SayNo2BJP, #NEET, #LeakGate వంటి హ్యాగ్‌ట్యాగ్‌లను ఆయన జతచేశారు.