శంషాబాద్ రూరల్, అక్టోబర్ 16: ప్రయాణికుల నుంచి రూ. 2.37 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్న సంఘటన శంషాబాద్ ఎయిర్పోర్టులో గురువారం చోటుచేసుకుంది. డీఆర్ఐ అధికారుల వివరాల ప్రకారం.. కువైట్ నుంచి హైదరాబాద్ మీదుగా షార్జాకు వెళ్తున్న ఎయిర్ అరేబియా (జీ 9467)లో శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చిన ప్రయాణికుల బ్యాగులను డీఆర్ఐ అధికారులు తనిఖీ చేశారు. వారి బ్యాగుల్లో ఎలాంటి రశీదులు లేని 1.789 కిలోల బంగారాన్ని గుర్తించారు. దీని విలువ సుమారు రూ.2.37 కోట్లు ఉంటుంది. వారిని అరెస్టు చేసి డీఆర్ఐ కార్యాలయానికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.