జనగామ, మే 21 (నమస్తే తెలంగాణ) : ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన మహానేతను లక్ష్యంగా చేసుకొని విచారణ పేరుతో కాంగ్రెస్ సరారు ఇబ్బంది పెట్టాలని చూస్తే, తెలంగాణ మరోసారి మర్లబడటం ఖాయమని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు.
కాళేశ్వరం కమిషన్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్పై కుట్రలకు, కక్ష సాధింపు చర్యలకు తెరలేపిందని మండిపడ్డారు. ప్రభుత్వంపై ప్రజల్లో పెల్లుబికుతున్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకే సీఎం రేవంత్ విచారణ పేరుతో నోటీసులు ఇస్తున్నారని ధ్వజమెత్తారు.