హైదరాబాద్ : నూతనంగా నిర్మించిన పార్లమెంట్ భవనానికి భారత రాజ్యంగ నిర్మాత డా.బీఆర్. అంబేద్కర్ పేరు పెట్టాలని ప్రజా గాయకుడు గద్దర్ అన్నారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్లో చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి కలిసి వినపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా గద్దర్ మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీపై యుద్ధం చేయడానికి సీఎం కేసీఆర్ వెంట నడవడానికి నేను సైతం సిద్ధం అని ప్రకటించారు. తెలంగాణ ఉద్యమ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. కాగా, అంబేద్కర్ రాజ్యాంగం వల్లే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా మాట్లాడారు.
అలాగే మంత్రి కేటీఆర్ ఇదే అంశంపై తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసినా అంశాన్ని ఎంపీ రంజిత్ రెడ్డి గుర్తు చేశారు. ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంటు భవనానికి అంబేద్కర్ పేరు పెట్టడం సముచితమేనని అన్నారు. ఇదే విషయాన్ని వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావిస్తానని వారికి హామీ ఇచ్చారు.