Gurukula Schools | తాండూరు, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): నేనురాను బిడ్డో సర్కారు దవాఖానకు అని ఉమ్మడి రాష్ట్రంలో ప్రజలు భయపడేవారు. కాంగ్రెస్ పాలనలో గురుకులాలకు ఆ దుస్థితి వచ్చింది. గురుకులాల్లో వరుసగా జరుగుతున్న ఫుడ్‌పాయిజన్ ఘటనలతో తల్లిదండ్రులు తమ పిల్లలను వసతిగృహాలకు పంపేందుకు భయపడుతున్నారు. పెట్టా, బేడా సర్దుకుని పిల్లలను ఇండ్లకు తీసుకెళ్తున్నారు.
ఏమో నమ్మకం లేదు సారూ!
వికారాబాద్ జిల్లా తాండూరు గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్‌తో అస్వస్థతకు గురై దవాఖానలో చికిత్స పొందుతున్న 11 మంది విద్యార్థుల్లో 9 మంది సోమవారం డిశ్చార్జి అయ్యారు. మరో ఇద్దరు విద్యార్థులు మాతాశిశు కేంద్రంలో చికిత్స పొందుతున్నా రు. వీరి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని వైద్యులు తెలిపారు. డిశ్చార్జి అయిన విద్యార్థులను తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళ్లారు. పిల్ల లు అస్వస్థతకు గురవడంతో తీవ్ర ఆందోళన చెందామని, వారు కోలుకోవడంతో ఊపిరి పీ ల్చుకున్నామని చెబుతున్నారు. కానీ ఇప్పుడు తమ పిల్లలను ఆశ్రమ పాఠశాలకు పంపాలం టే భయమైతున్నదని అంటున్నారు. పాఠశాలల లోపలికి ఎవరూ వెళ్లకుండా గేటుకు తా ళం వేసి, బయట పోలీసులు కూర్చోవడం ఏం టో అర్థం కావడం లేదని విమర్శిస్తున్నారు.
మెనూ పాటించని అధికారులపై చర్యలు
మెనూ ప్రకారం నాణ్యత ప్రమాణాలను పాటించని అధికారులపై చర్యలు తప్పవని కలెక్టర్ హనుమంతరావు హెచ్చరించారు. భువనగిరి పరిధిలోని హనుమాన్‌వాడలో గల తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సూల్ హాస్టల్‌ను సోమవారం ఆయన తనిఖీ చేశారు. భోజనంలో కొత్త మెనూ పాటించక పోవడం, విద్యార్థులకు పెట్టే గుడ్లు కూడా సరిగా లేకపోవడం, విద్యార్థుల చేత పనిచేయించడం కలెక్టర్ దృష్టికి రావడంతో ఆయన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెరుగుకు బదులుగా మజ్జిగ పెట్టిన తీరును కలెక్టర్ స్వయంగా పరిశీలించి, డైనింగ్ హాల్లో కొత్త మెనూ బోర్డు ఏర్పాటు చేయకపోవడంపై మండిపడ్డారు. విద్యార్థులకు వడ్డించే డైనింగ్ హాల్ శుభ్రంగా లేకపోవడంపై కేర్ టేకర్ రమేశ్‌ను సస్పెండ్ చేయగా, ప్రిన్సిపాల్ జగదీశ్వర్‌రెడ్డికి షోకాజ్ నోటీసు జారీ చేశారు.