వేములవాడ, జూన్ 17: సమస్యల పరిష్కారం కోసం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలోని గ్రామపంచాయతీల కార్మికులు కదం తొక్కారు. బుధవారం పెద్దసంఖ్యలో వేములవాడకు చేరుకున్నారు. సీఐటీయూ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్ నుంచి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ నివాసం వరకు ర్యాలీగా వెళ్లి ముట్టడించారు.
ఎమ్మెల్యే నివాసం ఎదుట రహదారిపై బైఠాయించారు. సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎల్లారెడ్డి, రమణ మాట్లాడుతూ.. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.