మంచిర్యాల : రాష్ట్రంలో అవినీతి తిమింగిలాలు ఏసీబీ ( ACB Raids ) వలకు చిక్కుకుంటు న్నాయి. నిన్న ఇద్దరు ఉద్యోగులు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడగా శుక్రవారం మంచిర్యాల ( Mancheryala ) జిల్లాలో పంచాయతీ కార్యదర్శి పట్టుబడ్డారు. జిల్లాలోని జన్నారం మండలంలో శుక్రవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు.
లింగయ్యపల్లె గ్రామపంచాయితీ కార్యదర్శి వరలక్ష్మి ( Secretary Varalakshimi ) లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఓ వ్యక్తి ఇంటి నిర్మాణానికి అనుమతి కోసం రూ.11 వేలు లంచం డిమాండ్ చేసినట్లు ఫిర్యాదు రావడంతో ఏసీబీ అధికారులు మాటువేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. తీసుకున్న లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు ఆమెపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు.