Harish Rao : సిద్ధిపేట జిల్లా ‘పదేండ్ల పండుగ’ను ఘనంగా నిర్వహించాలని, జిల్లా ఖ్యాతి ఎల్లలు దాటేలా వేడుకలు జరపాలని ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao ) పిలుపునిచ్చారు. ఉమ్మడి మెదక్ నుంచి వేరుపడిన సిద్దిపేట జిల్లాగా ఆవిర్భవించి అక్టోబరు 11వ తేదీకి పదేళ్లు కాబోతోంది. ఈ సందర్భాన్ని పునస్కరించుకొని అన్ని వర్గాల భాగస్వామ్యంతో పదేళ్ల పండుగ సభ నిర్వహించాలని హరీశ్ రావు నిర్ణయించారు.
సిద్దిపేట జిల్లా పదేళ్ల పండుగ సందర్భంగా జిల్లా ఖ్యాతి, కీర్తి ఎల్లలు దాటేలా ఘనంగా వేడుకగా నిర్వహించాలని తెలిపిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో తనను కలిసిన కవులు, కళాకారులు, జర్నలిస్టులు, వైద్యులు, లాయర్లు, ప్రజాసంఘాలు, వ్యాపారుల నుంచి జిల్లా పదేళ్ల పండుగపై అభిప్రాయాలు తీసుకున్నారు.
అలానే విద్యావేత్తలు, విశ్రాంత ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లు తదితర సంఘాల ప్రతినిధుల నుంచి కూడా హరీష్ రావు అభిప్రాయాలు స్వీకరించారు. సిద్ధిపేట జిల్లా సంస్కృతి, సంప్రదాయం ఉట్టిపడేలా మూడు రోజుల పాటు ఘనంగా పదేళ్ల ఉత్సవాలు చేపట్టాలని ఈ సమావేశంలో ఎమ్మెల్యే హరీశ్ రావు నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనవాస్, సిద్ధిపేట జిల్లా బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
సిద్దిపేట జిల్లా ఖ్యాతి ఎల్లలు దాటేలా పదేళ్ల పండుగ
సిద్దిపేట జిల్లా ఆవిర్భవించిన అక్టోబరు 11వ తేదీన అన్ని వర్గాల భాగస్వామ్యంతో పదేళ్ల పండుగ సభ నిర్వహించాలని నిర్ణయం
సిద్దిపేట జిల్లా పదేళ్ల పండుగ సందర్భంగా జిల్లా ఖ్యాతి, కీర్తి ఎల్లలు దాటేలా ఘనంగా వేడుకగా నిర్వహించాలని తెలిపిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కవులు, కళాకారులు, జర్నలిస్టులు, వైద్యులు, లాయర్లు, ప్రజాసంఘాలు, వ్యాపారులు, విద్యావేత్తలు, రిటైర్డ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లు తదితర సంఘాల ప్రతినిధుల అభిప్రాయాలు స్వీకరించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు
జిల్లా సంస్కృతి, సంప్రదాయాన్ని ఉట్టిపడేలా మూడు రోజుల పాటు ఘనంగా ఉత్సవాలు చేపట్టాలని సమావేశం నిర్ణయం
— Telugu Scribe (@TeluguScribe) October 4, 2026