ఉసిరికాయలపల్లి ఏహెచ్ఎస్ పాఠశాలలో డీడీ ఆకస్మిక తనిఖీ
ఉసిరికాయలపల్లి ఆశ్రమ ఉన్నత పాఠశాల (AHS)ను ఖమ్మం జిల్లా గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎం. ఫిరంగి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
కారేపల్లి,నవంబర్ 18 : ఖమం జిల్లా సింగరేణి మండల పరిధిలోని ఉసిరికాయలపల్లి ఆశ్రమ ఉన్నత పాఠశాల (AHS)ను ఖమ్మం జిల్లా గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎం. ఫిరంగి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందస్తు సమాచారం లేకుండా పాఠశాలను సందర్శించిన ఆయన పాఠశాలలో విద్యా బోధన, విద్యార్థులకు కల్పిస్తున్న వసతులు, పాఠశాల నిర్వహణకు సంబంధించిన పలు అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తనిఖీలో భాగంగా ముందుగా పాఠశాలలోని తరగతి గదులను సందర్శించి విద్యార్థులతో నేరుగా ముఖాముఖి మాట్లాడారు. తరగతుల్లో విద్యార్థుల అభ్యసన తీరును తెలుసుకోవడంతో పాటు పాఠ్యాంశాలపై వారికి ఉన్న అవగాహన గురించి ఆరా తీశారు.
చదువులో ఎదురవుతున్న ఇబ్బందులు, విద్యా సంబంధిత సమస్యలు, అవసరమైన సదుపాయాల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాఠశాల ఆవరణను క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యార్థులకు అందుతున్న భోజన సదుపాయాలు, వంటశాల నిర్వహణకు సంబంధించిన వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ధర్మా,సీనియర్ ఉపాధ్యాయులు, డిప్యూటీ వార్డెన్ గోపి, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఉసిరికాయలపల్లి ఏహెచ్ఎస్ పాఠశాలలో డీడీ ఆకస్మిక తనిఖీ
Korukanti Chander | బూడిద లారీల పేరిట కలెక్టర్ దోపిడీ..! : మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్
Rakul | వయ్యారాలు ఒలకబోస్తున్న రకుల్..క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో కట్టిపడేస్తున్న బ్యూటీ
AP news | పల్నాడులో మహిళలపై పోలీసుల లాఠీఛార్జ్!
Megastar Chiranjeevi | ఎవరినీ అడగలేదు.. కానీ ఆ డైరెక్టర్‌ను మాత్రం నాతో సినిమా చేయమని అడిగా: చిరంజీవి!
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

