Dulquer Salmaan | విమర్శలను మోటివేషన్‌గా మార్చుకుంటున్నా: దుల్కర్ సల్మాన్!
Aakasamlo Oka Tara | ప్రముఖ నటుడు దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) ఆన్లైన్ నెగెటివిటీ, విమర్శలను ఎదుర్కొనే విధానంపై మరియు అవి తన కెరీర్ ఎంపికలపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయనే దానిపై తాజాగా స్పందించారు.
ప్రముఖ నటుడు దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) ఆన్లైన్ నెగెటివిటీ, విమర్శలను ఎదుర్కొనే విధానంపై మరియు అవి తన కెరీర్ ఎంపికలపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయనే దానిపై తాజాగా స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. గతంలో తనను తీవ్రంగా కుంగదీసిన విమర్శలు ఇప్పుడు తనకు సులభంగా ఎదుర్కొనేలా మారాయని తెలిపారు.
తన ఉద్దేశం ఎప్పుడూ మంచి సినిమాలు చేయడమేనని, ఎంత కష్టపడినా కొద్దిపాటి నెగెటివిటీ రావడం సహజమని ఆయన గ్రహించారు. అయితే, ఆ నెగెటివిటీని తానెప్పుడూ కక్షగా లేదా అసూయగా మార్చుకోలేదని, దాన్ని ఒక మోటివేషన్‌గా తీసుకుని తనని తాను నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తానని దుల్కర్ వెల్లడించారు. “కొంతమంది నేను ఒక పాత్ర చేయలేనని భావిస్తే, నేను దాన్ని సవాల్‌గా తీసుకుని చేయడానికి ప్రయత్నిస్తాను. భయపెట్టే లేదా సవాల్‌తో కూడిన పాత్రలను ఎంచుకోవడం వల్ల నటుడిగా నా ఎదుగుదల సాధ్యమైంది. ప్రస్తుతం నాలో ఎలాంటి కసి లేదా పగ లేదు” అని ఆయన భావోద్వేగంగా చెప్పుకొచ్చారు.
మరోవైపు, పవన్ సాధినేని దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న తెలుగు డ్రామా చిత్రం ‘ఆకాశంలో ఒక తార’ (Aakasamlo Oka Tara) నవంబర్ 20, 2026న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదే రోజున ఆయన తండ్రి, మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించిన ‘ఓ.ఎం: ఆపరేషన్ మోల్’ (O.M: Operation Mole) కూడా విడుదలవుతుండటంతో, బాక్సాఫీస్ వద్ద తండ్రీకొడుకుల సినిమాల మధ్య ఆసక్తికరమైన పోటీ నెలకొంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dulquer Salmaan | విమర్శలను మోటివేషన్‌గా మార్చుకుంటున్నా: దుల్కర్ సల్మాన్!
ఉసిరికాయలపల్లి ఏహెచ్ఎస్ పాఠశాలలో డీడీ ఆకస్మిక తనిఖీ
Korukanti Chander | బూడిద లారీల పేరిట కలెక్టర్ దోపిడీ..! : మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్
Rakul | వయ్యారాలు ఒలకబోస్తున్న రకుల్..క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో కట్టిపడేస్తున్న బ్యూటీ
AP news | పల్నాడులో మహిళలపై పోలీసుల లాఠీఛార్జ్!
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

