Hanumakonda | నడికూడ, ఫిబ్రవరి 14 : పెండింగ్ బిల్లుల కోసం హనుమకొండ జిల్లా నడికూడ మండల కేంద్రంలో నడికూడ గ్రామ పంచాయతీ కార్యాలయం, భోజనశాలకు శుక్రవారం గ్రామ మాజీ సర్పంచ్, ఉత్తమ సర్పంచ్ అవార్డు గ్రహీత ఊర రవీందర్రావు తాళం వేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆత్మహత్యకు పాల్పడుతానని హెచ్చరిస్తూ వాటర్ ట్యాంకు ఎక్కారు.
గ్రామాభివృద్ధికి మొత్తం 51.50 లక్షల వరకు అప్పుతెచ్చి ఖర్చుచేశానని ఆవేదన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 14 నెలల నుంచి పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా ఇబ్బందిపెడుతున్నదని మండిపడ్డారు. అప్పులు ఇచ్చినవారు ఒత్తిడి చేస్తున్నా రని, తన కుటుంబం మొత్తం రోడ్డున పడిందని ఆందోళన వ్యక్తంచేశారు. సర్కా రు బిల్లులివ్వకపోతే తమకు ఆత్మహత్యే వాపోయారు.