22న పామాయిల్ ఫ్యాక్టరీ ప్రారంభం
బీఆర్ఎస్ హయాంలో పునాది పడిన మరో ప్రాజెక్ట్ ప్రారంభానికి సిద్ధమైంది. పామాయిల్ సాగులో రైతులను ప్రోత్సహించాలనే సదుద్దేశంతో నాడు బీఆర్ఎస్ సర్కార్ సిద్దిపేట జిల్లా నర్మెటలో మొదలుపెట్టిన పామాయిల్ ఫ్యాక్టరీని ఈ నెల 22న సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు.
- బీఆర్ఎస్ హయాంలో సిద్దిపేట జిల్లా నర్మెటలోకంపెనీకి శంకుస్థాపన
- రూ.300 కోట్లతో 62 ఎకరాల్లో అత్యాధునిక టెక్నాలజీతో నిర్మాణం
హైదరాబాద్, మార్చి 10(నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ హయాంలో పునాది పడిన మరో ప్రాజెక్ట్ ప్రారంభానికి సిద్ధమైంది. పామాయిల్ సాగులో రైతులను ప్రోత్సహించాలనే సదుద్దేశంతో నాడు బీఆర్ఎస్ సర్కార్ సిద్దిపేట జిల్లా నర్మెటలో మొదలుపెట్టిన పామాయిల్ ఫ్యాక్టరీని ఈ నెల 22న సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ మేరకు ప్రారంభతేదీని మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు మంగళవారం ప్రకటించారు. ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం సందర్భంగా వ్యవసాయ, అనుబంధశాఖల ఆధ్వర్యంలో 20 నుంచి 22 వరకు రైతుమేళా నిర్వహించనున్నట్టు తెలిపారు. పామాయిల్ రైతులకు భరోసా కల్పించేందుకు నాటి సీఎం కేసీఆర్ సిద్దిపేటలో ఫ్యాక్టరీ నిర్మించాలని నిర్ణయించారు.
ఇందులో భాగంగానే నాటి ప్రభుత్వం 2022 ఏప్రిల్ 13న ఫ్యాక్టరీ నిర్మాణాన్ని మొదలుపెట్టింది. ఫ్యాక్టరీ నిర్మాణాన్ని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు దగ్గరుండి పర్యవేక్షించారు. ఎలాంటి లోపాలు లేకుండా నిర్మాణం పూర్తయ్యేలా చేశారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఈ ఫ్యాక్టరీ నిర్మించడం గమనార్హం. రూ.300 కోట్లతో 62 ఎకరాల్లో అత్యాధునిక టెక్నాలజీతో ఈ ఫ్యాక్టరీని నిర్మించారు. తొలుత గంటకు 30 టన్నుల సామర్థ్యంతో పనిచేయనుండగా, భవిష్యత్తులో దీనిని గంటకు 120 టన్నుల వరకు విస్తరించేలా రూపకల్పన చేశారు. నిరుడు సెప్టెంబర్‌లోనే ఫ్యాక్టరీ నిర్మాణంతోపాటు ట్రయల్న్ కూడా పూర్తయ్యింది. ప్రస్తుతం ఫ్యాక్టరీ పని చేస్తూనే ఉన్నది. ఎన్నికలు, ఇతరత్రా కారణాలతో ప్రభుత్వం కంపెనీ ప్రారంభాన్ని వాయిదా వేస్తూ వచ్చింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి’
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
Blue Drum Murder | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితులు ముస్కాన్, సాహిల్‌కు మరణశిక్ష
Mythri Movie Makers | నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ హవా.. దసరా బరిలో కీలక సినిమాల పంపిణీ బాధ్యతలు ఆ సంస్థకే!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

