Palle Ravi Kumar Goud : ఫోన్ ట్యాపింగ్ కేసులో శాసన సభ ప్రతిపక్ష ఉపనేత హరీశ్ రావుకు సిట్ నోటీసులు ఇవ్వడం హాస్యాస్పదమని తెలంగాణ రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవి కుమార్ గౌడ్ (Palle Ravi Kumar Goud ) విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏమీలేదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా అధికారాన్ని అడ్డంపెట్టుకుని కాంగ్రెస్ సర్కార్ వేధింపులకు దిగుతోందని ఆయన మండిపడ్డారు. బొగ్గు కుంభకోణం, ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చలేని తమ అసమర్థతను, వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి రేవంత్ రెడ్డి చేస్తున్న డైవర్షన్ రాజకీయాల్లో భాగమే హరీశ్ రావుకు నోటీసులు అని ఆయన అన్నారు.
అధికారాన్ని అడ్డం పెట్టుకొని బీఆర్ఎస్ నాయకత్వాన్ని వేధించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని పల్లె రవికుమర్ తెలిపారు.* పోలీసులు ప్రభుత్వం చేతుల్లో కీలుబొమ్మలుగా పనిచేస్తున్నారని, భవిష్యత్తులో వారు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని గుర్తుంచుకోవాలని ఆయన పేర్కొన్నారు.