నవాబ్‌పేట, జూలై 29 : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోయిన రైతులకు కాళేశ్వరం ప్రాజెక్టు తరహాలో పునరావాసం, పునర్నిర్మాణం(ఆర్ అండ్ ఆర్) ప్యాకేజీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండల రైతులు బుధవారం పాదయాత్ర నిర్వహించారు.
ఉదండాపూర్ రిజర్వాయర్ నుంచి లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌కు సాగునీరు తరలించే ప్రధాన కాల్వ పరిధిలోని కారుకొండ, సిద్దోటం, రుద్రారం, యన్మన్గండ్ల, నవాబ్‌పేట, కామారం, అమ్మాపూర్, పొమాల్, కొల్లూర్ గ్రామాల రైతులు యన్మన్గండ్ల గేట్ నుంచి నవాబ్‌పేట తహసీల్దార్ కార్యాలయం వరకు పాదయాత్ర చేపట్టారు. నవాబ్‌పేటలోని అంబేద్కర్ విగ్రహానికి, తహసీల్దార్ సురేశ్కువినతిపత్రాలు సమర్పించారు.
హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ) : జెన్‌జీ యువత, మహిళలపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన కంగనా రనౌత్ క్షమాపణలు చెప్పాలని సీపీఐ జాతీయ కో-ఆర్డినేషన్ కమిటీ చైర్మన్ కే నారాయణ బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలు సమాజంలో విభేదాలను మరింత పెంచడమే కాకుండా ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీస్తాయని పేర్కొన్నారు. ఇదే సందర్భంగా ప్రదర్శనకారుల మనోభావాలను దెబ్బతీసిన తన గత ‘బొద్దింకలు’ వ్యాఖ్యలపై చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ సానుకూలంగా స్పందించడం అభినందనీయమని తెలిపారు. చేసిన వ్యాఖ్యల వల్ల కలిగిన బాధను గుర్తించి, వాటిని సరిదిద్దుకొనే వైఖరి న్యాయవ్యవస్థ ఔన్నత్యాన్ని ప్రతిబింబిస్తుందని ఆయన ప్రశంసించారు.