కారెక్కిన సీపీఐ సీనియర్ నేత కిలారు ప్రసాద్
కొత్తగూడెం నియోజవర్గ బీఆర్ఎస్ పార్టీలో బుధవారం భారీ చేరికలు జరిగాయి. ఉమ్మడి సుజాతనగర్ గ్రామ పంచాయతీకి చెందిన సిపిఐ సీనియర్ నాయకుడు కిలారు ప్రసాద్ ఆధ్వర్యంలో కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ లోని 11వ డివిజన్ పాత కొత్తగూడెంకు చెందిన సుమారు...
– బీఆర్ఎస్ లో పాత కొత్తగూడెం 11వ డివిజన్ నుండి భారీ చేరికలు
– గులాబీ కండువాలు కప్పిన ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 09 : కొత్తగూడెం నియోజవర్గ బీఆర్ఎస్ పార్టీలో బుధవారం భారీ చేరికలు జరిగాయి. ఉమ్మడి సుజాతనగర్ గ్రామ పంచాయతీకి చెందిన సిపిఐ సీనియర్ నాయకుడు కిలారు ప్రసాద్ ఆధ్వర్యంలో కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ లోని 11వ డివిజన్ పాత కొత్తగూడెంకు చెందిన సుమారు 100 మంది కార్యకర్తలు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర సమక్షంలో గులాబీ కండువాలు కప్పుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన చేరికల కార్యక్రమంలో వీరంతా గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ.. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అప్రజాస్వామిక పాలన కొనసాగుతొందని, ప్రజలు ఈ పాలనతో విసుగెత్తిపోయారన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ తిరిగి కేసీఆర్ పాలననే కోరుకుంటున్నారన్నారు.
రాష్ట్రంలో అధికారంలో ఉన్న 10 ఏళ్లు కేసీఆర్ రైతు పక్షపాతిగా పరిపాలించినట్లు తెలిపారు. ఆ నమ్మకంతోనే కొత్తగూడెం నియోజకవర్గంలో కూడా ప్రజలందరూ బీఆర్ఎస్ పార్టీ పట్ల విశ్వాసం చూపుతున్నారన్నారు. బీఆర్ఎస్ పార్టీలోకి చేరిన కిలారూ ప్రసాద్ ఆయన అనుచరులకు ఎంపీ రవిచంద్ర శుభాకాంక్షలు తెలిపారు. చేరికల కార్యక్రమానికి ముందు పాత కొత్తగూడెం 11వ డివిజన్ నుండి కిలారి ప్రసాద్ ఆధ్వర్యంలో 100 మోటార్ సైకిళ్లతో భారీ రాలీగా తెలంగాణ భవన్ కు వచ్చారు. పార్టీలో చేరిన వారు చర్ల వీరయ్య, పడాల భాస్కర్, మేకల వెంకన్న, గౌడ్ వెంకన్న, నాగేంద్ర, అశోక్, నరేష్, సందీప్, రాకేష్, నాగరాజు, అశ్వద్ధామ, సంజయ్ భార్గవ్, శశి, సాయి వంశీ, ఫణి కుమార్, అద్దాల రాము, శ్రీకాంత్, నరసింహ, ఆర్టీసీ రాజు, వంశీ తదితరులు ఉన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ దామోదర్ యాదవ్, సీనియర్ నాయకులు బీమా శ్రీధర్, మేకల నాగబాబు, కార్పొరేటర్లు బత్తుల మధు చంద్, మల్లెల రవిచంద్ర, గుణ చరిత్ముద్దంగుల మహేష్, జూనియర్ రాజేష మాదాసు పద్మ, డీకొండ సునీత, విజయ్, జగన్, సర్పంచ్ బాదావత్ శ్రీకాంత్, బొమ్మిడి రమాకాంత్, కన్ని, బొమ్మిడి శ్రీకాంత్, సంపు, పూసల విశ్వనాథం, సచిన్, కరాటే శీను, వెంకటేష్, తాండ్ర శీను, తోగర్ రాజశేఖర్, ఆనంద్, డాబా శంకర్, నరకట్ర శేఖర్, ఇర్ఫాన్, సేవియా, పెయింటర్ రాజేష్, భూపతి శీను పాల్గొన్నారు.

కారెక్కిన సీపీఐ సీనియర్ నేత కిలారు ప్రసాద్
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

