PRLIS | న్యూఢిలీ/హైదరాబాద్, జనవరి4 (నమస్తే తెలంగాణ): పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. అలాంటి ప్రతిపాదనేదీ తమ వద్ద లేదని తేల్చిచెప్పింది. అయితే ఈ ప్రాజెక్ట్‌కు మరో విధంగా ఆర్థికసా యం అందిజేస్తామని, ఇతర పథకాల కింద 60% నిధులు సమకూరుస్తామని హామీ ఇ చ్చింది. గురువారం ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డికి కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. సీఎం, ఉత్తమ్కుమార్గురువారం ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురి, జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను విడివిడిగా కలిసి వివిధ అంశాలపై వినతిపత్రాలు అందజేశారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కల్పించాలని కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్టు ప్రాధాన్యాన్ని వివరించారు. ఈ పథకం కింద 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు, 1,226 గ్రామాలతోపాటు హైదరాబాద్ మహా నగరానికి తాగునీరు సరఫరా చేయాల్సి ఉన్నదని చెప్పారు. ఇప్పటికే పలు అనుమతులు మంజూరయ్యాయని, మిగిలిన వాటిని కూడా త్వరితగతిన మంజూరు చేయాలని కోరారు. జాతీయ హోదా కల్పించి, 60% నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు అదనపు నిధుల కేటాయించేందుకు కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. 2014 తర్వాత కేంద్రం ఏ ప్రాజెక్టుకూ జాతీయ హోదా కల్పించలేదని, ఈ విధానం ప్రస్తుతం అమలులో లేదని చెప్పారని వెల్లడించారు. అయితే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ప్రాధాన్యం దృష్ట్యా ఆ ప్రాజెక్టుకు తమ శాఖ పరిధిలోని మరో పథకం కింద 60% నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.
హైదరాబాద్ మెట్రో రెండో దశ సవరించిన ప్రతిపాదనలను ఆమోదించాలని కేంద్ర పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురీకి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ మెట్రో రెండో దశను సవరించాల్సి ఉన్నదని తెలిపారు. సవరించిన ప్రతిపాదనల ప్రకారం ఈ ప్రాజెక్టును సంయుక్తంగా చేపట్టే విషయాన్ని పరిగణనలోనికి తీసుకోవాలని కోరారు. హైదరాబాద్‌లోని మూసీ రివర్‌ఫ్రంట్‌ను బహుళ విధాలా ఉపయోగపడేలా చేస్తామని, కేంద్రం తగిన మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో పేదలకు ఇచ్చే ఇందిరమ్మ ఇండ్లకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద అనుమతి ఇవ్వాలని కోరారు. తెలంగాణకు ఇండ్లు మంజూరు చేయడంతోపాటు బ్యాలెన్స్ నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. సీఎం వెంట సీఎస్ శాంతికుమారి, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, పట్టణాభివృద్ధి, పురపాలక వ్యవహారాల శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి దానకిశోర్, నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జ, ఈఎన్సీ మురళీధర్ ఉన్నారు.
మంత్రి ఉత్తమ్‌కుమార్‌తో కలిసి సీఎం రేవంత్శుక్రవారం ఢిల్లీలోని యూపీఎస్సీ కా ర్యాలయాన్ని సందర్శించనున్నారు. టీఎస్పీఎస్సీని యూపీఎస్సీ తరహాలో మార్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై యూపీఎస్సీ చైర్మన్‌తో చర్చించనున్నారు. ఆయనతోపాటు టీఎస్పీఎస్సీ కార్యదర్శి, ఐఏఎస్ అధికారులు పాల్గొంటారు. టీఎస్పీఎస్సీని సంసరించాలని సీఎం నిర్ణయించారని ఉత్తమ్ తెలిపారు.
తెలంగాణకు అదనంగా ఐపీఎస్ అధికారులను కేటాయించాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాకు సీఎం విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన సమయంలో తె లంగాణకు 76 మందినే కేటాయించారని తెలిపారు. జిల్లాల విభజన, వివిధ శాఖల పర్యవేక్షణ కోసం అదనంగా 29 పోస్టులు కేటాయించాలని కోరారు. 2024లో కొత్తగా వచ్చే ఐపీఎస్ బ్యాచ్ నుంచి అధికారులను అదనంగా కేటాయిస్తామని అమిత్‌షా హామీ ఇచ్చారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రేవంత్‌రెడ్డి అమిత్‌షాను కలవడం ఇదే ప్ర థమం. ఈ సందర్భంగా రాష్ట్రానికి చెంది న పలు అంశాలను అమిత్‌షా దృష్టికి తీ సుకెళ్లారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని వివిధ అంశాలను పరిష్కరించాలని కోరా రు. యాంటీ తెలంగాణ నారోటిక్స్ బ్యూరో బలోపేతానికి రూ.88 కోట్లు, సైబర్ సెక్యూరిటీ బ్యూరో బలోపేతానికి రూ.90 కోట్లు అదనంగా కేటాయించాలని కోరారు. రాష్ట్ర విభజన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్, హైకోర్టు భవనం, లోకాయుక్త, హెచ్చార్సీ వంటి భవనాలను వినియోగించుకున్నందున ఆ రాష్ట్రం నుంచి వడ్డీతో కలిపి మొత్తం రూ.408 కోట్లు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు.